Begin typing your search above and press return to search.
రిషి సునక్ ముందున్న ప్రధాన అడ్డంకులు ఏమిటి?
By: Tupaki Desk | 25 Oct 2022 5:30 PM GMTమనల్ని పాలించిన దేశానికి మనవాడు ప్రధాని అయిన సంబరం బాగానే ఉంది కానీ.. ముళ్లపొదలాంటి ఆ సీటులో కూర్చొని మన వాడు ఎంత వరకూ సఫలీకృతం అవుతాడన్నదే ఇప్పుడు అసలు సమస్య. ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రి కావడం అనేది మన రిషి సునాక్ ఖ్యాతి అని పొగిడన వారే రేపు తిట్టకుండా ఉండాలంటే బ్రిటన్ పాలకుల్లో చిరస్థాయిగా నిలబడాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. భారత జాతి నాయకత్వ పటిమకు ఇప్పుడు రిషి సునక్ నిదర్శనం. అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ ను గట్టెక్కించినప్పుడే రిషి హిట్ అవుతాడు. లేదంటే లిజ్ ట్రస్ లాగానే ఫ్లాప్ అవుతాడు.
బ్రిటన్ ప్రధాని అయితే అయ్యాడు కానీ ఇప్పుడు రిషి సునక్ ముందున్న ప్రధాన సమస్య ఆ దేశంలోని ఆర్థిక సంక్షోభం.. అలాగే రాజకీయ సంక్షోభం. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ బ్రిటన్ లోనూ ఆ మూలాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆర్థికమాంద్యం ఆందోళన చాలా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో అతిపెద్ద కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఇదే దారిలో ఇంకా చాలా కంపెనీలు నిర్ణయాలు తీసుకోబోతున్నాయి.దీంతో నిరుద్యోగం బ్రిటన్ లోనూ విపరీతంగా పెరిగిపోతోంది. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం కారణంగా సమాజంపై పడే ప్రభావం అన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న లింకు. గతంలో ఓసారి ఆర్థిక మాంద్యం ఎదురైతే చాలా దేశాలు కుప్పకూలాయి. ఇప్పుడు ప్రపంచాన్ని ఆ మాంద్యం బయపెడుతోంది.
సరిగ్గా దీన్ని డీల్ చేయలేకనే ఇటీవల ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్ విఫలమైంది. ఆమె చేతిలో ఓడిన రిషి సునాక్ ఇప్పుడు పగ్గాలు చేపట్టారు. సునక్ తీసుకోబోయే ప్రతీ నిర్ణయం బ్రిటన్ భవిష్యత్తును నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక స్థిరత్వం చేయడమే సునాక్ ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు.
ఇక కన్జర్వేటివ్ పార్టీలో నాయకుడు లేడు. వ్యవహారం చక్కబడలేదు. రోజుకో నేత ప్రధానిగా, పార్టీ నేతగా అవుతున్నారు. ప్రధానమంత్రులు మారడంపై పార్టీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు. రాజకీయంగా అధికార పార్టీకి అనుకూలత ఉన్నా నడిపించే నాయకుడు లేడన్న బాధ ఉంది. రేపటి ఎన్నికల వేళ రిషి సునాక్ నిర్ణయాలే కన్జర్వేటివ్ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తుంది.. లేదంటే ఓడించేలా చేస్తుంది. దీంతో ఇటు రాజకీయంగా.. అటు ఆర్థికంగా రిషి సునక్ నిర్ణయాలే ఆ దేశాన్ని నడిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.