Begin typing your search above and press return to search.

ప్ర‌జల బాటా... ప‌నుల బాటా... వైసీపీ నేత‌ల ప్లాన్ ఏంటో...!

By:  Tupaki Desk   |   19 April 2022 2:30 PM GMT
ప్ర‌జల బాటా... ప‌నుల బాటా...  వైసీపీ నేత‌ల ప్లాన్ ఏంటో...!
X
మ‌రో ప‌ది రోజుల్లో ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌రో కొత్త కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శ్రీకారం చుట్ట నున్నారు. మే 1వ తేదీ.. మేడేను పుర‌స్క‌రించుకుని.. జ‌గ‌న్‌.. ఇంటింటికీ వైసీపీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న తాడేప‌ల్లి నుంచి ప్రారంభించి.. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కుల‌తో అమ లు చేయించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇప్పుడు.. ఎంత‌మంది నాయ‌కులు.. ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకుంటారు..? అనేది చ‌ర్చ‌గా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నే ఆవేద‌నలో ఉన్నారు.

దీంతో నాయ‌కులు.. చాలా మంది పార్టీ కార్యాల‌యాల‌కు కూడా రావ‌డం లేదు. పైగా నేత‌లు.. చాలా మం ది త‌మ‌కు ప‌నులు ఉన్నాయంటూ.. హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరుకు వెళ్లిపోయారు.

మ‌రికొంద‌రు ఢిల్లీ లోనూ మ‌కాం వేశార‌ని తెలిసింది. ఈ ప‌రిణామాల‌నేప‌థ్యంలో అస‌లు జ‌గ‌న్ ప్రారంభిస్తున్న ఇంటింటికీ.. వైసీపీ కార్య‌క్ర‌మం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంది? అనేది సందిగ్ధంగా మారింది. వ‌చ్చే రెండుసంవ‌త్స‌రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని.. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టి నుంచి ఆదాయంపై దృష్టి పెట్టారు.

దీంతో వారివారి వ్యాపారాలు.. వ్య‌వ‌హారాల్లో తీరిక లేకుండా ఉన్నారు. మ‌రోవైపు.. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌ని వారు కూడా.. పోయింది ఎలానూ పోయింది.. ఇప్పుడు జ‌నంలో తిరిగినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు ఇస్తార‌నే గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు హ్యాండిచ్చిన‌ట్టే రేపు కూడా హ్యాండిస్తే.. ఏం గాను మా ప‌రిస్థితి? అని నోరు వెళ్ల‌బెడుతున్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి వారు కూడా.. త‌మ ప‌నులు తాము చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు.. నాయ‌కుల‌ను కేడ‌ర్ కూడా ఇబ్బంది పెట్టేసూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలో కేడ‌ర్‌తో ప‌నిచేయించుకున్న నాయ‌కులు త‌ర్వాత‌.. వారిని ప‌క్క‌న పెట్టారు. అం తేకాదు... మూడేళ్లు అయినా.. కేడ‌ర్‌కుచేసింది ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో రేపు ఇంటింటికీ వైసీపీ అంటే.. వారు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేద‌ని.. అన్ని జిల్లాల్లోనూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా యి.

ఈ నేప‌థ్యంలో రేపు ఇంటింటికీ.. కార్య‌క్ర‌మం ప్రారంభించినా.. కేడ‌ర్ రాదు. సో.. నాయ‌కులు ఒక్క‌రే అన్నీ అయి.. ఈ కార్య‌క్ర‌మాన‌న్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి. ఇది సాధ్యం కాద‌ని.. నాయ‌కులు ముందుగానే చెప్పేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం విజ‌యంపై అధిష్టానం త‌ల‌ప‌ట్టుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.