Begin typing your search above and press return to search.

అయోధ్య పై ఇప్పటి వరకూ వచ్చిన తీర్పులు ఏమిటి ?

By:  Tupaki Desk   |   9 Nov 2019 4:13 AM GMT
అయోధ్య పై ఇప్పటి వరకూ వచ్చిన తీర్పులు ఏమిటి ?
X
పాతి కేళ్ల కాదు యాభై ఏళ్లు కాదు. ఏకంగా 134 సంవత్సరాల వివాదం. అయోధ్య లోని వివిదాస్పద భూమి కి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరివన్న విషయం మీద సాగుతున్న సుదీర్ఘ వివాదాని కి చెక్ చెప్పేందుకు వీలుగా ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వనుంది. ఈ తీర్పు ఎలా ఉంటుందన్న విషయం పై యావత్ దేశం మొత్తం ఎంతో ఉత్కంఠ తో ఎదురుచూస్తోంది.

సుప్రీం తీర్పునకు ముందు.. వివిధ దశల్లో వివిధ న్యాయ స్థానాలు తీర్పులు ఇచ్చాయి. ఎప్పుడు ఏ కోర్టు లో ఏ తీర్పు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. గతంలో ఎన్ని తీర్పులు ఇచ్చినప్పటికీ 2010 సెప్టెంబరు 30న అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత కీలక మైనదిగా చెబుతారు. ఇంతకీ ఆ తీర్పు ఏమని చెప్పిందన్న విషయాన్ని చూస్తే..

అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును ముగ్గురు సభ్యులున్న ధర్మాసనం వెలువరించింది. జస్టిస్ డీవీ శర్మ.. జస్టిస్ సుధీర్ అగర్వాల్.. జస్టిస్ ఎన్ యూ ఖాన్ లు ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాల్ని చూస్తే..
జస్టిస్ డీవీ శర్మ చేసిన కీలక వ్యాఖ్య చూస్తే..

వివాదాస్పద స్థలం రాముడి జన్మ స్థానమే. దాన్ని బాబర్ ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధంగా నిర్మించారు. ఆ నిర్మాణానికి మసీదు లక్షణాలే లేవు.
జస్టిస్ సుధీర్ అగర్వాల్ చేసిన కీలక వ్యాఖ్య ఇది.

హిందువుల విశ్వాసం ప్రకారం అది రామ జన్మస్థానమే. ఇక్కడ మసీదు ఎప్పుడు.. ఎవరు నిర్మించారో రుజువు కాలేదు. ముస్లింలు దీన్ని చిరకాలంగా మసీదు గానే భావిస్తూ వచ్చారు.

జస్టిస్ ఎన్ యూ ఖాన్ చేసిన కీలక వ్యాఖ్య ఏమంటే మసీదు నిర్మాణం కోసం ఏ గుడినీ కూల గొట్టలేదు. చాలాకాలంగా పడి ఉన్న ఆలయ శిథిలాల మీద మసీదును నిర్మించారు.

ముగ్గురు సభ్యులున్న ధర్మాసనం చేసిన ఉమ్మడి తీర్పు చూస్తే. ఈ వివాదాస్పద ప్రాంగణాన్ని మూడు సమ భాగాలుగా విభజించాలి. హిందూ.. ముస్లింలకు అప్పగించాలి. బాబ్రీమసీదును కూల్చి రామ్ లల్లా విగ్రహాలు నెల కొల్పిన తాత్కాలిక మందిరం ఉన్న ప్రదేశాన్ని శ్రీరాముడి జన్మ స్థలంగా పరిగణించి.. దాన్ని రామ్ లల్లా విరాజ్ మాన్ కు అప్పగించాలి.

రామ్ ఛబుత్ర.. సీతార సోయిని నిర్మొహి అఖాడా కు ఇవ్వాలి. మిగిలిన మూడో భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలి. వివాదాస్పద స్థలం పై యాజమాన్య హక్కులు ఎవరికి చెందవు. అందుకు నిర్దుష్టమైన సాక్ష్యాధారాలేమీ లేక పోవటమే కారణం. ఇది మూడు పక్షాల ఉమ్మడి ప్రాంగణం. అందువల్ల ముగ్గురికీ ఉమ్మడి హక్కులు కల్పిస్తున్నాం.