Begin typing your search above and press return to search.

బ్లాక్​ఫంగస్​ లక్షణాలేమిటి? ఎవరికి సోకుతుంది?

By:  Tupaki Desk   |   15 May 2021 8:30 AM GMT
బ్లాక్​ఫంగస్​ లక్షణాలేమిటి? ఎవరికి సోకుతుంది?
X
బ్లాక్​ఫంగస్​ ఇటీవల ఈ పేరు వింటేనే చాలా మందికి వెన్నులో వణుకుపుడుతోంది. ఓవైపు కరోనా సెకండ్​ వేవ్​ విరుచుకుపడుతోంది. ఆస్పత్రులు అన్నీ కోవిడ్​ బాధితులతో నిండిపోయాయి. ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. బెడ్స్​ దొరకడం లేదు. ఇక ఏదైనా ఆస్పత్రులో బెడ్​ కావాలంటే ఎంపీ, మంత్రి స్థాయి వ్యక్తితో సిఫారసు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో బ్లాక్​ఫంగస్​ అనే మరో భయంకర వ్యాధి తెరమీదకు వచ్చింది. ముఖ్యంగా కోవిడ్​ తో బాధపడుతూ.. స్టీరాయిడ్స్​ ఎక్కువగా తీసుకున్నవారికి, మధుమేహ (షుగర్​) వ్యాధిగ్రస్థులకు, కిడ్నీ మార్పిడి లాంటి శస్త్ర చికిత్స చేయించుకున్నవాళ్లకు ఈ వ్యాధి బయటపడుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

మొదట్లో ఈ వ్యాధి ఆనవాళ్లు ఎక్కువగా ఉత్తరాదిలో కనిపించాయి. ఢిల్లీ, ముంబైలో కొంతమందికి ఈ వ్యాధి సోకింది. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణలోనూ బ్లాక్​ఫంగస్​ బాధితులు బయటపడ్డారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు, నలుగురు ఈ బ్లాక్​ ఫంగస్​ తో బాధపడుతున్నట్టు సమాచారం. అయితే బ్లాక్​ ఫంగస్​ ఎవరికి వస్తుంది? ఏ పరిస్థితుల్లో వస్తుంది? తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..

బ్లాక్​ ఫంగస్​ పై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ కీలక సూచనలు చేశారు.
కోవిడ్​ నుంచి కోలుకున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించినట్టు ఆయన చెప్పారు. కరోనా బాధపడుతూ స్టిరాయిడ్స్​ తీసుకున్న వారిలో ఈ వ్యాధి కనిపించదని చెప్పారు. ప్రారంభంలో గుర్తిస్తే బ్లాక్​ఫంగస్​ ను నయం చేయవచ్చని ఆయన తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు మాత్రమే ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్పారు.
షుగర్​ తో బాధపడేవాళ్లకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.

బ్లాక్​ఫంగస్​ లక్షణాలు..

కళ్లు ఎర్రబారటం, ముక్కు చుట్టూ నొప్పి, అధిక జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండకపోవడం కూడా వ్యాధి లక్షణాలు. కరోనా ట్రీట్​మెంట్​ తీసుకున్నవాళ్లందరికీ ఈ వ్యాధి సోకే అవకాశం లేదు. కేవలం కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది.