Begin typing your search above and press return to search.
ఈ బూతులేంటి...వీధి రౌడీలను మించిపోయారే...
By: Tupaki Desk | 20 Oct 2022 8:10 AM GMTఏపీలో మాటల యుద్ధం మొదలైంది. రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో చెప్పులు చూపిస్తూ వైసీపీ నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఇపుడు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవనిగడ్డలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొందరు నాయకులు వీధి రౌడీలను మించిపోయి దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని, చెప్పులు కూడా చూపిస్తున్నారని విమర్శించారు. వారు చెప్పుకోవడానికి ఏమి లేకనే ఇలా చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి నాయకులా రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసేది అంటూ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా హాట్ కామెంట్స్ చేశారు. మూడు రాజధానుల వల్ల ఏపీకి మంచి జరుగుతుంది అని మన ప్రభుత్వం చెబుతూంటే మూడు పెళ్ళిళ్ల వల్లనే మేలు జరుగుతుందని ఒకాయన అంటున్నాడని పరోక్షంగా పవన్ మీద విమర్శలు దట్టించారు. సభ్య సమాజం సహించలేని విధంగా బూతులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఏపీలో ఒక్క జగన్ని ఎదుర్కోవడానికి దుష్ట చతుష్టయం దత్తపుత్రుడి అండతో చంద్రబాబు అనేక రకాలైన ఎత్తులు వేస్తున్నారని ఆయన అన్నారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న పోరాటం అని ఆయన అభివర్ణించారు. వారంతా మీడియాను, దత్తపుత్రుడిని నమ్ముకుంటే తాను ప్రజలను దేవుడిని నమ్ముకున్నానని జగన్ చెప్పుకొచ్చారు.
మ్యానిఫేస్టోలో అన్ని అంశాలను తుచ తప్పకుండా తాము అమలు చేస్తూంటే గిట్టని వారు తమ మీద యుద్ధం చేస్తామని అంటున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి మ్యానిఫేస్టో ఎక్కడ ఉందో కూడా చెప్పలేకపోతున్నారని, వెన్నుపోటుదారులు కూడా నీతులు చెబుతున్నారంటూ చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. అందరూ ఏకమై వచ్చినా తనకు భయం లేదని, జనం అండగా ఉన్నారంటూ జగన్ పేర్కోనడం విశేషం.
మొత్తానికి పవన్ కళ్యాణ్ అనుచైత వ్యాఖ్యల ఎపిసోడ్ తో పాటు పవన్ చంద్రబాబు పొత్తుల మీద కూడా జగన్ స్పందిస్తూ ఈ రకమైన కామెంట్స్ చేశారని భావిస్తున్నారు. ఎవరొచ్చినా తాను జనం అండతోనే వస్తాను భయం లేదని చెప్పడం ద్వారా జగన్ ప్రత్యర్ధుల పొత్తుల మీదనే హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు. చూడాలి మరి దీని మీద విపక్షాల కౌంటర్లు ఏ విధంగా ఉంటాయో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.