Begin typing your search above and press return to search.
ఎటుపోతోందీ యువత..? ముద్దూలేదు ముచ్చట లేదు.. సెక్స్ కన్నా ఆ దరిద్రమే ఇష్టమట!
By: Tupaki Desk | 11 March 2021 1:30 AM GMTటీనేజ్ షురూ అయ్యిందంటే.. ఒళ్లు వేడెక్కడం మొదలవుతుంది! అది జ్వరం కాదు.. మరోరకమైన మార్పు! అది పెరుగుతూ యంగ్ ఏజ్ వచ్చే నాటికి ఒంట్లో బ్లడ్ లావాలా ప్రవహిస్తూ ఉంటుంది.. అప్పుడు అర్థమవుతుంది దేహం దాహాన్ని కోరుకుంటోందని! బయటి పరిస్థితులు.. కట్టుబాట్లు.. బంధనాలు వేయొచ్చుగాక.. కానీ, కోరిక మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. రాయిని తన్నితే పదహారు ముక్కలైపోవాల్సిన ఆ వయసులో కోరికలు గుర్రాలై దౌవుడు తీస్తుంటే.. తమాయించుకొని పగ్గాలు వేయడం తరం కాదంటే అతిశయోక్తి కాదు!
కానీ.. ఈరోజుల్లో పొల్లగాళ్లు ఆ విషయాన్నే గుర్తించట్లేదట. గుర్తించిన కొద్దిమంది కూడా.. మరో వ్యాపకాల్లో పడి మరిచిపోతున్నారట! మొత్తంగా.. యువతలో సెక్స్ యావ తగ్గిపోతోందని చెబుతోంది ఓ అధ్యయనం! ఇటీవల కంప్లీట్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందంటున్నారు అమెరికన్ పరిశోధకులు!
స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, రట్జర్స్ యూనివర్సిటీ రీసెర్చ్ టీం సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న దాదాపు రెండు వేల మంది యువతీ యువకులపై ఈ పరిశోధన సాగించారు. ఈ రీసెర్చ్ ద్వారా సెక్స్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారి శాతం గతేడాది కంటే పెరిగిందని తేల్చారు. ఇది మగవారిలో మరింతగా పెరిగిందని గుర్తించారు. గతంలో 18.9 శాతం మందిలో లైంగిక చర్యపై పెద్దగా ఆసక్తి లేదని తేలగా.. అది ఇప్పుడు ఏకంగా 30.9 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
దీనికి గల కారణాలను కూడా విశ్లేషించారు పరిశోధకులు. ప్రధానంగా యువతులు, యువకులు మద్యం మత్తులో తూలుతూ లైంగిక జీవనంపై ఆసక్తిని కోల్పోతున్నారట. ఇక, పురుషుల్లో మరీదారుణంగా.. వీడియో గేమ్ కూడా ప్రధాన పాత్రపోషిస్తోందట. వీడియో గేమ్ లలో మునిగిపోతూ సెక్స్ అనే విషయం ఒకటుందనే సంగతి కూడా మరిచిపోతున్నారట. వీటితోపాటు జీవితంలో త్వరగా సెట్ కాకపోవడం కూడా ఓ కారణంగా గుర్తించారట. మరికొందరమే పోర్న్ వీడియోలు చూస్తూ అసలైన శృంగార మాధుర్యాన్ని కోల్పోతున్నారట.
బాబులూ.. పాపలూ విన్నారుగా.. అతి మద్యం వల్ల లైంగిక జీవితానికి ముప్పు వాటిల్లడం ఒకెత్తయితే.. ఆఖరికి పనికి మాలిన వీడియో గేమ్ లు కూడా శృంగార జీవితానికి విలన్లుగా మారడం దారుణం! ఇకనైనా గుర్తించి, ఓ పద్ధతిగా వాడితే మంచింది.