Begin typing your search above and press return to search.
ఏపీకి బీజేపీ ఏమిచ్చింది....జగన్.. బాబు.. పవన్ చెప్పాలి
By: Tupaki Desk | 14 July 2022 5:30 PM GMTరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అన్ని పార్టీలు బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేశాయి. ఇది ఒక విచిత్రమైన సంఘటన, సందర్భంగా కూడా చెప్పుకోవాలి. బీజేపీ ఏపీకి ఏమీ చేయకపోయినా బీజేపీకి ఏపీలోని రాజకీయ పార్టీలు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఏపీ జనాలు ఏమిటి ఇది అని వెటకారంగా మాట్లాడుకుంటున్నారు.
ఉదాహరణకు చూస్తే 2019 ఎన్నికల వేళ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల మేరకు ప్రత్యేక హోదాను ఏపీకి బీజేపీ ఇచ్చిందనా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు పూర్తి నిధులు ఇస్తామని బీజేపీ చెప్పిందనా, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టినందుకనా, లేక విభజన హామీలు నెరవేర్చినందుకనా. ఇలా వేటిని బీజేపీ చేసిందని ఇంత పూర్తి మద్దతు ఏపీ నుంచి బీజేపీకి దక్కుతోంది అని జగన్ని జనాలు అడుగుతున్నారు.
ఇక కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు బీజేపీని మోడీని ఏపీలోనూ దేశంలోనూ కూడా పూర్తిగా ఉతికి ఆరేశారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వాన ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిందని భావించే బాబు కాంగ్రెస్ నాయకత్వాన యూపీయే కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇపుడు చంద్రబాబే బీజేపీ మద్దతు మీద తన జవాబు చెప్పాలి.
ఏపీకి బీజేపీ గత మూడేళ్ళలో ఏమి ఇచ్చిందని చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు అన్నది జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఏమీ కాకుండానే బీజేపీని నాడు తిట్టి నేడు మద్దతు ఇవ్వడం వెనక మతలబు ఏమిటి అన్నది చంద్రబాబు చెప్పాల్సి ఉంది. టీడీపీలో కూడా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఈ విషయంలో చర్చించుకుంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏపీకి బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అందరిక్ కంటే ఎక్కువగా గొంతు చేసి చాలా కాలం క్రితమే ఆరోపించారు. నాడు ఆయన చేసిన ఆరోపణలు జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీశాయి. అటువంటి పవన్ 2019 ఎన్నికలు అయిపోయాక మళ్ళీ బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. అంతటితో ఆయన ఆగలేదు, బీజేపీ వారు రోడ్డు మ్యాప్ ఇస్తేనే తాను ముందుకు కదులుతాను అని కూడా తన సొంత పార్టీ సభలో బాహాటంగా చెప్పేసుకున్నారు.
సరే ఇంతలా బీజేపీ కనుసన్ననలో నడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ కి బీజేపీ పెద్దలైన మోడీ, అమిత్ షా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని అంటున్నారు. అయినా సరే కమలం చేయిని పవన్ ఈ రోజుకీ వీడడంలేదు, ఇపుడు తగుదునమ్మా అని రాష్ట్రపతి ఎన్నికల వేళ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి రాష్ట్రం అందునా బీజేపీ చేత ఇబ్బందులు పడుతూ హామీలు ఏవీ నెరవేర్చుకోలేని రాష్ట్రంగా ఉన్న ఏపీ మొత్తానికి మొత్తం గుత్తంగా ఓట్లు అన్నీ బీజేపీకే వేయడం అంటే అలా అర్ధం చేసుకోవాలని అంతా అంటున్నారు.
కేవలం ముగ్గురు నాయకులు తమ స్వార్ధ రాజకీయాలను చూసుకుంటూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. దానికి వారు పెట్టుకున్న అందమైన పదం సామాజిక న్యాయం అని. ఇది నిజంగా బిల్డప్ పదం తప్ప మరేమీ కాదు, బీజేపీ సామాజిక న్యాయం వెనక ఉన్న అసలు కారణాలు వేరు అని ప్రతీ ఒక్కరికీ తెలుసు అంటున్నారు.
ఇక బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వవచ్చు కాక. కానీ ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఏ ఒక్క పార్టీ కూడా కనీసంగా కూడా బీజేపీ పెద్దలను నిగ్గదీయలేకపోవడమే బాధాకరం, దారుణం అని అంతా అంటున్నారు. దీన్ని బట్టి బీజేపీ అన్నా, మోడీ, అమిత్ షా అన్నా వీళ్ళకు ఎంత భయమో అర్ధమవుతోంది అంటున్నారు.
మొత్తానికి చూస్తే సోషల్ మీడియాలో ఈ ముగ్గురు నాయకులను నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. జగన్ తనకు ఉన్న కేసుల విషయంలో భయపడుతున్నారని, చంద్రబాబు అయితే సీబీఐ, ఈడీ వంటి సంస్థల ద్వారా తమ మీద ఎక్కడ దాడులు చేయిస్తారో అని ఆలోచిస్తున్నారని, ఇక పవన్ కళ్యాణ్ అయితే ఈ విధంగా అయినా మోడీ అమిత్ షాల అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని ఆలోచిస్తూ ఈ రకమంగా మద్దతు బీజేపీకి ప్రకటించారు అని నెటిజన్లు అటున్నారుట.
ఏది ఏమైనా ఒక్క విషయం. ఏపీ ఒక విషయంలో రికార్డు బద్ధలు కొట్టింది. బీజేపీకి కూడా సాధ్యం కానీ ఫీట్ ని సక్సెస్ చేసింది. దేశంలో ప్రత్యర్ధి అభ్యర్ధికి ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా అన్నీ బీజేపీ అభ్యర్ధికే పడుతున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టిస్తోంది. మరి దీనిని చూసి కమలమనాధులు సంతోషిస్తే ఏపీ జనాలు మాత్రం ఇదేమి రాజకీయం అనుకుంటున్నారు.