Begin typing your search above and press return to search.

ఏం బిజినెస్ రా బాబు.. 14 ఏళ్ల క్రితం రూ.291 కోట్లు ఇప్పుడు రూ.9967 కోట్లు

By:  Tupaki Desk   |   27 April 2022 11:30 PM GMT
ఏం బిజినెస్ రా బాబు.. 14 ఏళ్ల క్రితం రూ.291 కోట్లు ఇప్పుడు రూ.9967 కోట్లు
X
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో.. మతాలు.. కులాలు.. ప్రాంతాలు..ఇలా ఎంతో విలక్షణ.. అంతుకు మించిన విచిత్ర పరిస్థితులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది మన దేశం. అలాంటి దేశంలో ఒక ఆటను మతంగా ఫీలై.. అన్నింటిని మర్చిపోయి.. కలిసిపోయేలా చేసే గుణం క్రికెట్ సొంతం. ఈ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లి కొత్త టాలెంట్ ను పరిచయం చేయటం ఒక ఎత్తు అయితే.. దీన్ని భారీ ఎత్తున సొమ్ము చేసుకోవటానికి వీలుగా సిద్ధం చేసిన బిజినెస్ ఫార్మాట్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్). పద్నాలుగేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ గురించి అంచనా వేసిన వారంతా నక్కను తొక్కినట్లుగా.. వేలాది కోట్లను సంపాదించేశారు. అంతకు మించిన ఫేంను సొంతం చేసుకున్నారు.

ఐపీఎల్ ఫార్మాట్ ను ప్రకటించినంతనే ముందు చూపుతో కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు తమ జట్ల కోసం బిడ్డింగ్ లు వేయటం.. సొంతం చేసుకోవటం జరిగింది. మిగిలిన వారు ఆసక్తి చూపించినా..ఒక జట్టు కోసం ఇంత భారీగా పెట్టుబడులు పెట్టాలా? అంటూ వెనకడుగు వేయటం.. ఆ తర్వాతి కాలంలో బంగారం లాంటి బిజినెస్సును మిస్ అయ్యామన్న భావనకు గురి కావటం చాలామందిలో చూసిందే. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఫోర్బ్స్ సంస్థ ఐపీఎల్ సంస్థల తాజా విలువను లెక్క కట్టింది. పద్నాలుగేళ్ల క్రితం ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు జట్ల విలువను డిసైడ్ చేసి.. తాజాగా పోల్చినప్పుడు వాటి పెరుగుదల భారీగా ఉండటం గమనార్హం.

ఐపీఎల్ మొదలైనప్పుడు ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఒక జట్టు సగటు విలువ రూ.291 కోట్లు. పద్నాలుగేళ్ల తర్వాత అదే జట్టు సగటు విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.7975 కోట్లు. అంటే.. ప్రారంభ సీజన్ విలువతో పోలిస్తే తాజా విలువ ఏకంగా 27 రెట్లు పెరగటం విశేషం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రపంచంలోని మరే క్రికెట్ లీగ్ లు ఏవీ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి రాలేకపోవటం.

జట్ల విలువలోనూ ప్రపంచంలోనూ మరే క్రీడా లీగుల్లోనూ ఇంత భారీగా పెరుగుదలను నమోదు చేయలేదని చెబుతున్నారు. అమెరికా కేంద్రంగా సాగే రగ్బీ కానీ బాస్కెట్ బాల్ లీగ్ జట్లు సైతం ఐపీఎల్ కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. ఇక.. ఐపీఎల్ లో అత్యధిక విలువ కలిగిన జట్టుగా ముకేశ్ అంబానికి చెందిన ముంబయి ఇండియన్స్ జట్టే నిలిచింది. మొదటి ఐదు స్థానాల్లో ముంబయి.. చెన్నై.. కోల్ కతా.. లఖ్ నవూ.. ఢిల్లీలు నిలిచాయి. చివరి మూడు జట్లుగా గుజరాత్ (10).. పంజాబ్ (9).. హైదరాబాద్ (8) స్థానాల్లో నిలిచాయి.

తాజాగా జట్ల విలువను చూస్తే..

జట్టు విలువ (కోట్లల్లో)

1. ముంబయి 9967
2. చెన్నై 8817
3. కోల్ కతా 8434
4. లఖ్ నవూ 8242
5. దిల్లీ 7936
6. బెంగళూరు 7859
7. రాజస్థాన్ 7667
8. హైదరాబాద్ 7438
9. పంజాబ్ 7093
10. గుజరాత్ 6520