Begin typing your search above and press return to search.

శాసనసభా సంఘం ఏమి చేయగలుగుతుంది?

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:30 PM GMT
శాసనసభా సంఘం ఏమి చేయగలుగుతుంది?
X
'డేటా దొంగలను దోషులుగా నిలబెడతాం..ప్రైవేటు ఏజెన్సీల ద్వారా స్పైవేర్ కొనుగోలు చేసిన అప్పటి అధికారులందరినీ విచారిస్తాం' ఇది తాజాగా శాసనసభ సంఘం ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబునాయుడు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారని, ప్రజాప్రతినిధుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ కు అక్రమంగా ఉపయోగించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆ ఆరోపణలపైనే విచారించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసన సభా సంఘాన్ని నియమించింది.

అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాతే నలుగురు ఎంఎల్ఏలతో శాసన సభా సంఘం ఏర్పాటైంది. సంఘం మొదటి మీటింగ్ బుధవారం అమరావతిలో జరిగింది. ఈ సమావేశానికి హోం, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, ఐటి రంగంలోని నిపుణులు హాజరయ్యారు. అంతాబాగానే ఉంది కానీ లీగల్ గా జరగని ప్రక్రియను ఇప్పటి సభాసంఘం ఏ విధంగా నిరూపించగలదు అనేదే పెద్ద ప్రశ్న. స్పైవేర్ కొనుగోలు చేసింది నిజమే అని అనుకున్నా ఎక్కడా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ లేవు.

ప్రభుత్వం తరఫున డబ్బులు చెల్లించినట్లు కూడా ఆధారాలు లేవు. ఇదే సమయంలో ప్రభుత్వమే ఇజ్రాయెల్ కంపెనీకి స్పైవేర్ సరఫరా చేయాలని ఆర్డర్ ఇచ్చినట్లు కూడా లేదు. అంటే ప్రభుత్వం తరపున ఆర్డర్ ఇవ్వలేదు, డబ్బులు చెల్లించలేదని స్పష్టమవుతోంది.

ప్రైవేటు ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేశారని అనుకున్నా దానికి ప్రభుత్వానికి సంబంధాన్ని చూపించలేరు. ప్రభుత్వం చెబితేనే ప్రైవేటు ఏజెన్సీ స్పైవేర్ కొన్నట్లు ఎక్కడా రికార్డు మూలకంగా ఆధారాలు లేవు.

అంటే రాతమూలకంగా కానీ ఇతరత్రా రూపాల్లో కానీ ప్రభుత్వం పాత్రను నిరూపించేందుకు ఏ విధమైన ఆధారాలు లేవు. మరలాంటపుడు ఈ శాసన సభా సంఘం ఎవరిని విచారిస్తుంది ? ఏమని తేలుస్తుంది ? ఎవరిని బాధ్యులను చేస్తుంది.

ఇప్పటివరకు అనేక ఆరోపణలపై ప్రభుత్వం వేసిన కమిటిలు ఏ విషయాన్ని నిరూపించలేకపోయాయి. చాలా అంశాల్లో విచారణకు కోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఇపుడు విచారణ మొదలు పెట్టిన శాసన సభా సంఘం కూడా తేల్చేదేముండదని అందరికీ తెలుసు. పైగా ఇదే పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, ప్రయోగంపై సుప్రింకోర్టు ఆధ్వర్యంలోనే ఒక నిపుణుల కమిటి విచారణ జరుపుతోంది. కాబట్టి ఇవన్నీ జరిగేవి కాదు పెట్టేదీకాదు