Begin typing your search above and press return to search.
111 నియోజకవర్గాల సమీక్షల్లో చంద్రబాబు తేల్చిందేమిటి?
By: Tupaki Desk | 29 Oct 2022 2:30 PM GMTఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికలు తమ పార్టీకి జీవన్మరణ సమస్య అని ఆయన భావిస్తున్నారు. మరోమారు వైసీపీ గెలిస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
తన సహజశైలికి భిన్నంగా ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ చంద్రబాబు ఇప్పటి నుంచే తన పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల బలాబలాలు, అభ్యర్థుల ఆర్థిక, అంగ బలాలు, ప్రత్యర్థి పార్టీల స్థితిగతులు ఇలా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు.
మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 111 నియోజకవర్గాల్లో చంద్రబాబు సమీక్షలు పూర్తి చేశారు. ఈ సమీక్షల్లో ఆయా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు ఉన్నచోట వారికి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి నుంచే గట్టిగా పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైన, ప్రజల సమస్యలపైన గట్టిగా పోరాడాలని కోరుతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు, మినీ మహానాడు కార్యక్రమాలను బాగా నిర్వహించాలని ఆదేశిస్తున్నారు.
అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడేవారు ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు నేతలున్న చోట చంద్రబాబు మరింత జాగరూకతతో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అసమ్మతి, అనైకత్యలపై ఆయనపై దృష్టిపెట్టారని అంటున్నారు. అసమ్మతి ఉన్నా, అనైక్యత ఉన్నా ఆయన అసలు ఉపేక్షించడం లేదని పేర్కొంటున్నారు.
ఇలా నేతల మధ్య ఐక్యత లేకపోవడం, సమన్వయం లేకపోవడం, అసమ్మతి వంటి కారణాలతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశామని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అందరూ కలసికట్టుగా సాగాలని.. కేంద్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అందరినీ కలుపుకు వెళ్లాలని ఆయన ఉద్భోధిస్తున్నారు.
ఎక్కడా అనైక్యత, అసమ్మతి మాట వినిపించకూడదని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు సూచిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది నేతలు ప్రజల్లో చురుగ్గా లేకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజలతో కలివిడిగా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన గట్టిగా దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.