Begin typing your search above and press return to search.
సూటి ప్రశ్న వేసిన చంద్రబాబు.. 3 రాజధానులపై 4ఏళ్లలో ఏం చేశాడు?
By: Tupaki Desk | 17 Nov 2022 4:25 AM GMTఒక రాజధాని కాదు.. మూడు రాజధానులు వస్తే చాలు ఏపీ అభివృద్ధి అమాంతం ఎక్కడికో వెళుతుందని చెప్పే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘాటు కౌంటర్ ఇచ్చారు విపక్ష నేత చంద్రబాబు. ఇంతకాలం మూడు రాజధానులపై వైసీపీ నేతలు.. మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు.. వినిపిస్తున్న వాదనలకు కాస్త లేటుగా అయినా లేటెస్టుగా సరైన రీతిలో ప్రశ్నను సంధించారు చంద్రబాబు.
నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడు రాజధానుల గురించి చెబుతున్నారు. మరి.. ఈ నాలుగేళ్లలో మూడు రాజధానులకు జగన్ సర్కారు చేసింది ఎంత? అన్న ప్రశ్నను ఆయన సంధిస్తున్నారు. నిజమే.. తన ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు ఒక రాజధానిగా పేర్కొనటం.. దానికి సంబంధించిన పనులు.. తాత్కాలిక భవనాల పేరుతో అసెంబ్లీ.. సెక్రటేరియట్ తో పాటు పలు భవనాల్నినిర్మించారు. మరి.. మూడు రాజధానుల గురించి అదే పనిగా చెప్పే జగన్మోహన్ రెడ్డి.. కనీసం మూడు బిల్డింగులు మూడు ప్రాంతాల్లో నిర్మించారా? అన్నది ఇప్పుడు ప్రశ్న.
మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేయటమే తప్పించి.. ఆ దిశగా అడుగులు పడింది లేదు. అలాంటప్పుడు మూడు రాజధానుల వల్ల మూడు ప్రాంతాల్లోని ప్రజలకు ఒరిగిందేమిటి? అన్నది ప్రశ్న. మూడురాజధానుల పేరుతో అప్పటికే రాజధానిగా డిసైడ్ చేసిన అమరావతిని అడ్డుకోవటం ద్వారా జగన్ సాధించిందేమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో నష్టపోయింది ఏపీ ప్రజలే తప్పించి మరెవరూ కాదన్నది మర్చిపోకూడదు. చంద్రబాబు మీద కోపంతో మూడురాజధానుల కాన్సెప్టును తెర మీదకు తెచ్చిన జగన్.. మూడు రాజధానుల్ని ఏర్పాటు చేసింది లేదు. దీంతో.. అసలు రాజధానికి సంబంధించి ఏ నిర్మాణం.. పని.. ఈ నాలుగేళ్ల కాలంలో జరగలేదన్నది మర్చిపోకూడదు.
తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు నిప్పులు చెరిగారు. "నేను అడుగుతున్నా.. ప్రపంచంలో ఎక్కడైనా సరే.. మూడు రాజధానులన్న దేశం కానీ రాష్ట్రం కానీ ఎక్కడైనా ఉందా? అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ పేటీఎం బ్యాచ్ ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లు. వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరిగిపోతుందని. నాలుగేళ్లు అయ్యింది. ఇప్పుడే పత్తికొండకు వస్తా ఉంటే.. రోడ్డు చూశా (చంద్రబాబు నోటి నుంచి ఆ మాట వచ్చినంతనే జనాల్లో పెద్ద ఎత్తున అరుపులు).. బాగుంది కదా? మంచి రోడ్డు కదా (వ్యంగ్యంగా).. మీరు ఆనందంగా ఉన్నారు కదా? పత్తికొండకు రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కట్టి అభివృద్ధి చేస్తాడంట' అంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం మూడు రాజధానుల మాటతో కాలం గడిపిన వైసీపీకి.. నాలుగేళ్లలో మూడు రాజధానుల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? అన్న బాబు ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. మరేం జరుగుతుందోచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.