Begin typing your search above and press return to search.

సీఎం జగన్ ఆరోపణల లేఖ తర్వాత జస్టిస్ రమణ హాజరైన ప్రోగ్రాంలో ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   18 Oct 2020 6:30 AM GMT
సీఎం జగన్ ఆరోపణల లేఖ తర్వాత జస్టిస్ రమణ హాజరైన ప్రోగ్రాంలో ఏం మాట్లాడారు?
X
ఇటీవల జాతీయ మీడియాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ పేరు పెద్ద ఎత్తున రావటం తెలిసిందే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పలు ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరయ్యారు జస్టిస్ రమణ. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆర్. లక్ష్మణన్ సంతాప సభకు హాజరైన ఆయన.. ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..

- న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలి.ఒత్తిళ్లు.. ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. ఒక వ్యక్తి మంచి జీవితం కొనసాగించాలంటే ఎన్నో గుణాల్ని అలవరుచుకోవాలి.

- వినయం.. ఓర్పు.. దయ.. కచ్ఛితమైన కార్యచరణ.. నిరంతరం నేర్చుకుంటూ తనను తాను మెరుగుపరుచుకోగలిగే ఉత్సాహం వంటి లక్షణాలు ఉండాలి.

- ప్రత్యేకించి న్యాయమూర్తులుతమ విలువలకుబలంగా కట్టుబడి ఉండాలి. నిర్ణయాలు తీసుకోవటంలో నిర్భయంగా ఉండాలి.

- ఒత్తిళ్లు.. ఆటంకాలు.. అన్ని రకాల ఇబ్బందుల్నిదైర్యంగా ఎదుర్కోగలగాలి. ప్రజల విశ్వాసమే న్యాయ వ్యవస్థకు ఉన్న గొప్ప బలం.

- నమ్మకం.. ఆమోదయోగ్యతలు బలవంతపెడితే రావు. వాటిని సంపాదించుకోవాలి. మన విలువలే మనకున్న గొప్ప సంపద. వాటిని ఎప్పుడూమర్చిపోకూడదు.

- ఒక మహానుభావుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ప్రజలు రాముణ్ని కొలవాల్సింది ఆయన విజయాలను చూసి కాదు. అత్యంత కష్ట సమయాలను కూడా చాలా సంతోషంగా ఎదుర్కొన్న విధానాన్ని చూసి. అదే విలువలకు ఇచ్చే గౌరవం. ఒకరి జీవితంలోఅత్యంత గొప్ప క్షణాలు అవే.

- ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. వాటిని నీవు ఎలా ఎదుర్కొన్నావన్నదే ముఖ్యం. అదే నీ సత్తా ఏంటో నిర్ణయిస్తుంది.