Begin typing your search above and press return to search.

ఆవిర్భావ వేళ లోకేశ్ ఏమ‌న్నారంటే..?

By:  Tupaki Desk   |   29 March 2022 9:30 AM GMT
ఆవిర్భావ వేళ లోకేశ్ ఏమ‌న్నారంటే..?
X
40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు ఎన్టీఆర్, రాముడు చంద్రబాబు మన ధైర్యం.. కార్యకర్తలు మన బలం..పసుపు జెండా మన పవర్. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత, అభివృద్ధిని పరిచయం చేసింది మా నాన్న. అధికారం ఉన్నా, లేకపోయినా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దాం...అని సోష‌ల్ మీడియాలో లోకేశ్ త‌న సందేశం ఉంచారు.

ఈ నేప‌థ్యంలో లోకేశ్ పిలుపును అనుస‌రించి ఆవిర్భావం వేళ చాలా చోట్ల వేడుక‌లకు స‌మాయ‌త్తం అవుతున్నారు. జిల్లాల‌లో పార్టీ ప‌తాక‌విష్క‌ర‌ణ‌ల‌తో పాటు ప‌లు వేడుక‌లు, వీలున్నంత వ‌ర‌కూ అన్న‌దాన కార్య‌క్ర‌మాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. శ్రీ‌కాకుళం జిల్లాలో పార్టీ కార్యాల‌యంలో జ‌రిగే వేడుకల‌కు మాజీ విప్ ర‌వి హాజ‌రుకానున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా కార్య‌క‌ర్త‌ల‌కు అండగా ఉండేందుకు అధినాయ‌క‌త్వం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్ర‌మాద బీమా కానీ వ‌ర్తింప జేయ‌డంలో టీడీపీ అధినేత స‌త్వ‌ర చొర‌వ చూపాల‌ని కోరుకుంటున్నారు.

కార్య‌క‌ర్త‌ల‌కు గ‌తంలో క‌న్నా ఇప్పుడు ప్రాధాన్యం ఉన్నా అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ప‌ల్ల‌కీలు మోసే వారిని మ‌రిచిపోతున్నార‌న్న వాద‌న‌ను కూడా వినిపిస్తున్నారు. ఆరోజు ఎన్టీఆర్ వెనుక న‌డిచిన వారు రామ దండు పేరిట ఆయ‌న‌తో తిరిగిన‌వారు ఇవాళ నాటి రోజులు త‌లుచుకుంటున్నారు. హైద్రాబాద్ , గండిపేట కేంద్రంగా ఆ రోజు త‌మ‌కు ఎన్టీఆర్ శిక్ష‌ణ ఇచ్చిన రోజుల‌ను మరువ‌లేమ‌ని కూడా అంటున్నారు. ఆర్ఎస్ఎస్ త‌రహా లో దేహ దారుఢ్య పెంపున‌కు శిక్ష‌ణ ఉండేద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టిలా అవి డిజిట‌ల్ రోజులు కాద‌ని అయిన‌ప్ప‌టికీ వివిధ ప‌త్రిక‌ల ద్వారా పార్టీ ఇచ్చిన పిలుపు అందుకుని ప‌నిచేసేవార‌మ‌ని అంటున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో భాష‌కు ప్రాధాన్యం ఇస్తూ కృషి చేసిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌దేన‌ని కార్య‌క‌ర్త‌లు గుర్తు చేసుకుంటున్నారు.స‌నాత‌న ప‌ద్ధతుల్లో రామారావు, ఆధునిక ఒర‌వ‌డిలో చంద్ర‌బాబు పార్టీని ముఖ్యంగా ఇరు ప్రాంతాల‌ను ఇంకా ముఖ్యంగా నాటి రాజ‌ధాని హైద్రాబాద్ ను అభివృద్ధి చేశార‌ని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు తో స‌హా చాలా మంది నాయ‌కులు త‌మ గూటి ప‌క్షులేనని కూడా పున‌రుద్ఘాటిస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ సుశిక్షిత నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తుల‌కు కార్ఖానా అని కూడా అంటున్నారు. అదేవిధంగా హైద్రాబాద్ న‌గ‌రం అంటే గుర్తుకు వ‌చ్చే ట్యాంక్ బండ్ ద‌గ్గ‌ర బుద్ధుని విగ్ర‌హం ఏర్పాటు.. అదే దారి వెంట ఉద్దుండుల విగ్ర‌హాలు ఏర్పాటు అన్న‌వి త‌మ హ‌యాంలో జ‌రిగిన‌వేన‌ని అంటున్నారు టీడీపీ కార్య‌క‌ర్త‌లు. హైటెక్ సిటీ నిర్మాణం కూడా త‌మ‌దేన‌ని నాటి రోజుల స్మ‌ర‌ణ‌లో సంతోషం వ్య‌క్తం చేస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్నారుకార్య‌క‌ర్త‌లు.