Begin typing your search above and press return to search.
కేసులు పెరుగుతున్న వేళలో లాక్ డౌన్ పై నిర్మలమ్మ ఏమన్నారు?
By: Tupaki Desk | 14 April 2021 3:30 PM GMTకరోనా కేసులు దేశ వ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. రెండో దశ కరోనా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. దీంతో.. రోజురోజుకి కేసుల నమోదు ఎక్కువ అవుతోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ విధించటం.. కొన్ని నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇలాంటివేళ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
కోవిడ్ విస్తరణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించే వీల్లేదని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని.. స్థానికంగా నియంత్రణ చర్యల్ని చేపడతామని చెప్పారు. దీంతో.. కేసుల సంఖ్య ఎంత పెరిగినా.. చర్యలు స్థానికంగా ఉంటాయే తప్పించి దేశ వ్యాప్తంగా మాత్రం ఉండవన్న విషయాన్ని నిర్మలమ్మ తన మాటలతో స్పష్టం చేసినట్లు చెప్పారు.
మొదటి దశ కరోనాను సమర్థంగా కట్టడి చేసేందుకు తాము లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకున్న మోడీ సర్కారు.. ఏడాది తిరిగేసరికి లాక్ డౌన్ విధింపు లేదన్న విషయాన్ని ఇంత స్పష్టంగా ఎందుకు చెబుతున్నట్లు? అన్న సందేహం రాక మానదు. ఇదే అంశంపై ఆమె క్లారిటీ ఇచ్చేశారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలోకి నెట్టటం తనకు ఇష్టం లేదని.. కరోనా కట్టడికి ఆయా కంటైన్ మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రాల కోవిడ్ సమాచారాన్ని తాము సేకరించామని.. చర్యలు బాగున్నట్లు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీ లాక్ డౌన్ దిశగా తాము వెళ్లటం లేదన్నారు. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. వ్యాక్సిన్.. కరోనా నిబంధనలు లాంటి ఐదు స్థంభాల వ్యూహంతో తాము కరోనాను కట్టడి చేస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. వైరస్ బారిన పడిన వారిని హోం క్వారంటైన్ చేస్తామని చెప్పారు. రోజుకు రెండు లక్షల కేసులు చేరువైన వేళ.. పాజిటివ్ కేసులు అంతకంతకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటివేళలో లాక్ డౌన్ వాదనలు జోరందుకున్నాయి. ఇలాంటివేళ.. నిర్మలమ్మ లాక్ డౌన్ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారని చెప్పాలి.