Begin typing your search above and press return to search.

కోట్ల రూపాయలు తీసుకొని రవిశాస్త్రి ఏం చేశాడు?

By:  Tupaki Desk   |   13 Sep 2021 6:45 AM GMT
కోట్ల రూపాయలు తీసుకొని రవిశాస్త్రి ఏం చేశాడు?
X
టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇటీవల వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వెళ్లి కరోనా బారినపడ్డారు. కోహ్లీకి నమ్మినబంటుగా ఉండడంతో రవిశాస్త్రికి ఆడింది ఆటపాడింది పాటగా మారిందన్న విమర్శలున్నాయి. ఓడినా.. గెలిచినా పెద్దగా ఎఫెక్ట్ పడంది రవిశాస్త్రిపైనే అంటున్నారు. ఇప్పుటు టీ20 వరల్డ్ కప్ తో రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తోంది. దీంతో తప్పుకునేందుకు సమయం ఆసన్నమైంది. 60 ఏళ్లు కూడా నిండుతుండడంతో ఇక రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా తప్పుకోవడం ఖాయమంటున్నారు.

ఇంగ్లండ్ పర్యటన అర్తాంతరంగా ముగియడానికి రవిశాస్త్రినే కారణమని.. అతడే పుస్తకావిష్కరణకు హాజరై కరోనాను అంటించుకోవడమే కాకుండా.. ఇతర టీమిండియా సిబ్బందిని కూడా ప్రమాదంలో నెట్టేశాడు. చివరి టెస్ట్ రద్దు కావడానికి రవిశాస్త్రినే కారణమని తీవ్ర విమర్శలు చెలరేగాయి. బీసీసీఐ పర్మిషన్ కూడా తీసుకోకుండా రవిశాస్త్రి, కోహ్లీ బయటకు వెళ్లడంతో బోర్డు వర్గాలు గుర్రుగా ఉన్నాయి. దీనిపై బీసీసీఐ కోచ్, కెప్టెన్ కు చీవాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది.

టీమిండియా కోచ్ గా ఉండి బుక్ మార్కెట్ చేసుకోకపోతే ఏమయ్యేదని.. కోచ్ గా కొనసాగుతూ ప్రైవేటు ఈవెంట్లకు వెళ్లడం భావ్యమా? అని నెటిజన్లు రవిశాస్త్రిని ట్రోల్ చేస్తున్నారు. 8 కోట్ల వరకు వార్షిక వేతనం తీసుకుంటూ ఆటగాళ్లకు హద్దులూ.. శుద్ధులు చెప్పాల్సిన కోచ్ ఇలా తన వ్యక్తిగత వ్యాపారం కోసం పాకులాడడంతో ఐదో టెస్ట్ రద్దు అయ్యిందని విమర్శలు చేస్తున్నారు. శాస్త్రి చేసిన పనికి ఇప్పుడు టీమిండియానే తిడుతున్న పరిస్థితి.

అయితే రవిశాస్త్రి మాత్రం తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నాడు. ఇంగ్లండ్ లో ఎలాంటి కరోనా రిస్టిక్షన్స్ లేవని.. అలాంటప్పుడు తనను అనడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అభిమానులు స్టేడియాలకు వచ్చి చూస్తున్నారని.. తనను టార్గెట్ చేయడం మంచిది కాదని రవిశాస్త్రి అంటున్నారు.