Begin typing your search above and press return to search.

మాజీ బాయ్ ఫ్రెండ్ ముఖం చూడటం ఇష్టం లేని షకీరా ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   19 Jan 2023 11:30 PM GMT
మాజీ బాయ్ ఫ్రెండ్ ముఖం చూడటం ఇష్టం లేని షకీరా ఏం చేసిందంటే?
X
ప్రముఖ పాప్ సింగర్ షకీరా.. స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పీక్ వివాహ బంధానికి గతేడాది బీటలు పడింది. 12 ఏళ్లుగా కొనసాగిన వీరి మధ్య బంధం అధికారికంగా తెగదెంపులు కావడంతో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అయితే వీరివురు విడిపోయినప్పటికీ కూడా ఒకే ఇంటిలో ఉంటున్నారు. అయితే తన మాజీ బాయ్ ఫ్రెండ్ పీక్ మొఖాన్ని చూడలేక షకీరా ఏకంగా ఇంట్లో ఓ భారీ గోడను నిర్మించడం చర్చనీయాంశంగా మారింది.

షకీరా.. పీక్ లు బార్సిలోనాలోని ఓ ఏరియాలో రెండంతస్తుల భవనాన్ని గతంలో కొనుగోలు చేశారు. వీరి పెళ్లి తర్వాత ఈ భవంతిలోనే కాపురం చేశారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. గతేడాది వీరికి విడాకులు మంజూరు కాగా వీరిద్దరు ఆ ఇంటిలోనే ఉంటున్నారు. ఇదే ఇంటిలో పిక్ తన తల్లిదండ్రులతో పై అంతస్థులో ఉంటున్నాడు. కింది అంతస్తులో షకీరా ఉంటుంది.

ఈ క్రమంలోనే షకీలా తన మాజీ బాయ్ ఫ్రెండ్ పీక్ ముఖం చూడటం ఇష్టం లేక బార్సిలోనా లోని తన ఇంటిలో ఏకంగా పెద్ద గోడ కట్టించింది. షకీరా ఇంటికి సిమెంట్ మిక్సర్ కాంక్రీట్ లారీ రావడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు షకీరా ప్రవర్తన పట్ట పీక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షకీరాను పీక్ తల్లి మాంటి సెరాట్ బెర్నాబ్యూ ఇంటిలో నిర్మించిన గోడను తొలగించాలని కోరగా ఆమె పట్టించుకోలేదని చెబుతోంది. మరోవైపు ఇన్ని గొడవల మధ్య వీరితో కలిసి ఉండలేనని అందుకే తాను గోడ కట్టినట్లు షకీరా చెబుతుంది. దీంతో ఈ గోడ వ్యవహారంపై నెటిజన్లు తమదైన శైలిలో సైటర్లు పేలుస్తున్నారు. ఈ గోడ వ్యవహరం ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.