Begin typing your search above and press return to search.
వైఎస్ హెలికాఫ్టర్ మిస్ అయిన రాత్రి షర్మిల ఏం చేశారు?
By: Tupaki Desk | 27 Sep 2021 5:33 AM GMTఆసక్తికర విశేషాలెన్నో బయటకు వచ్చాయి తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో. నిత్యం వార్తల్లో దర్శనమిచ్చే ఒక మహానేత కుమార్తె షర్మిలను.. వైరి వర్గంగా ముద్ర పడిన మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఇంటర్వ్యూ చేయటం ఒక సంచలనమైతే.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర ప్రశ్నల్ని సంధించారు. అలా అడిగిన ప్రశ్నలకు నేర్పుగా బదులిచ్చిన షర్మిల తీరును చూసి.. మొత్తానికి రాటుదేలుతున్నావ్.. అన్న కితాబును ఇచ్చారు ఆర్కే.
తండ్రి కూచిగా పేరున్న షర్మిలను వైఎస్.. పాప్స్ (పాప) అని పిలిచేవారని.. మిగిలిన బంధువర్గం మొత్తం షమ్మీ అని పిలుస్తారని చెప్పారు. తనకేదైనా బాధ కలిగితే తన కంటే ముందు తన తండ్రి వైఎస్ కళ్లల్లో నీళ్లు కనపడేవని.. చాలా ప్రేమగా చూసుకున్నారన్నారు. వైఎస్ కుటుంబానికి కలలో కూడా ఊహించని రీతిలో ఎదురైన విషాదం గురించి షర్మిలను అడిగిన సందర్భంలో ఆమె ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆమె చెప్పిన మాటల్ని ఆమె మాటల్లోనే చూస్తే..
‘‘నిజానికి హెలికాప్టర్ మిస్సయిందన్నప్పుడు నేను వెంటనే ఎక్స్‌ప్లోషన్ ఏమైనా డిటెక్ట్ అయిందా అని ఎంక్వైరీ చేశాను. అలాంటిదేమీ లేదన్నారు. దాంతో నాకు వేరే అనుమానమే రాలేదు. భయపడలేదు. వానపడుతుంది... ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయివుంటారు. కమ్యూనికేషన్ మనకు అందడంలేదనే అనుకున్నా. చుట్టుపక్కల వాళ్లంతా భయపడుతున్నారు కానీ... ‘ఏం కాదులే’ అని సెప్టెంబరు 2 రాత్రి నేను పడుకున్నా. అమ్మా వాళ్లందరూ ప్రేయర్ చేస్తున్నారు. మరుసటి రోజు తెల్లారి కూడా నేనసలు భయపడలేదు. అప్పుడు ఒకటి తరువాత మరొకటి తెలిసింది. చాలా షాకయ్యాను. తొమ్మిది నెలలపాటు విపరీతంగా బాధపడ్డాను. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. వాస్తవ పరిస్థితుల్లోకి రాలేకపోయాను. దాదాపు ఏడాది తరువాత గానీ మామూలు మనిషి కాలేకపోయాను’’ అని చెప్పారు. వైఎస్ మరణించిన వేళ.. ఇంట్లో ఆయన భౌతికకాయాన్ని ఉంచుకొని.. వెనుక ఇంట్లో జగన్ సంతకాల సేకరణ చేపట్టారన్న ఆరోపణకు షర్మిల సమాధానం ఇచ్చారు. జగన్ సంతకాల సేకరణ చేపట్టలేదని స్పష్టం చేసిన ఆమె.. ఆయన తరఫున వేరే వారు చేశారన్నారు.
సోనియాగాంధీని కలిసినప్పుడు.. ఓదార్పుయాత్ర చేస్తానంటే ఆమె వద్దన్నారని.. ఈ సందర్భంగా తాను కలుగజేసుకొని ప్రజల సెంటిమెంట్స్ ను తెలియజేశానని..ఆమెకు అర్థమయ్యేలా చెప్పినా.. ఆమెకు అవేమీ అర్థం కాలేదన్నారు.