Begin typing your search above and press return to search.
'అమరావతి' పై హైకోర్టు ధర్మాసం ఎవరికి చివాట్లు పెట్టింది?
By: Tupaki Desk | 3 Nov 2022 7:30 AM GMTవిషయాన్ని విషయంగా చూసే కంటే.. తమకు నచ్చినట్లు.. తాము కోరుకున్నట్లుగా విషయాల్ని చెబుతున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ప్రతి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏపీ రాజధాని అమరావతిపై గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై తాజాగా తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఏపీ అధికారపక్షం తనదైన భాష్యాన్ని చెబుతుంటే.. మరోవైపు హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలన్ని ఏపీ ప్రభుత్వానికే చెంపపెట్టుగా కొందరు చేస్తున్న వాదనల్లో నిజం ఎంతన్నది చూడాల్సి ఉంది.
మొత్తంగా అమరావతి రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు ఏం చెప్పింది? ఈ అంశంపై చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటి? ఈ వ్యాఖ్యలు ఎవరికి ఇబ్బందికరం? అన్న విషయాన్ని సాపేక్షంగా చెప్పాల్సి వస్తే.. హైకోర్టు వ్యాఖ్యల్ని నిశితంగా చూడాలి. అదే సమయంలో హైకోర్టు ఇప్పుడెందుకు స్పందించింది అన్న విషయంలోకి వెళితే..
అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర చేయాలని అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన షరతులతో తమకు సంఘీభావం తెలియజేసే హక్కు లేకుండా పోతుందని అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య.. రాజధాని రైతు పరిరక్షణ సమితిలు అక్టోబరు 27న అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం అమరావతి రాజధాని ఉదంతం.. దానిపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని గతంలో ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇవ్వటం తెలిసిందే. దీనికి భిన్నంగా ఈ ఇష్యూను సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లటంతో పాటు.. తాము డిసైడ్ అయిన మూడు రాజధానులకు మద్దతుగా పలు కార్యక్రమాల్ని చేపట్టటం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
- స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ సమావేశాల్ని నిర్వహించటం సరికాదు. ఇలాంటి చర్యలు అభినందించదగినవి కావు. హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత.. కర్నూలులో హైకోర్టు కోసం నిరసన కార్యక్రమాల్ని చేపట్టటం సరికాదు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తోంది?
- రాజధాని అమరావతి అని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చాక.. అదే అంశంపై రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటివన్ని రైతుల్ని ముందు ఉంచి రాజకీయ పాదయాత్రలు.
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్ పీలు దాఖలు అయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూడాలి.
- అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై థర్డ్ పార్టీ అయిన మీరెలా అప్పీలు వేస్తారు?
హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ప్రభుత్వం తీరును మాత్రమే కాదు.. అమరావతి రైతుల తీరును తప్పు పట్టింది. అదే సమయంలో.. అమరావతినే రాజధాని అని కోర్టు చెప్పిన తర్వాత మళ్లీ పాదయాత్రలు ఎందుకు? అన్న కీలక వ్యాఖ్యతో పాటు.. సుప్రీంకోర్టు నుంచి వచ్చే తీర్పు వరకు వెయిట్ చేయాలన్న విషయాన్ని చెప్పింది. తాజా వ్యాఖ్యల్ని చూసినప్పుడు అటు ప్రభుత్వానికి.. ఇటు అమరావతి రైతుల తీరును హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టిందనే చెప్పాలి. ఇద్దరు తమ తీరును మార్చుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.