Begin typing your search above and press return to search.
ఆర్టీసీపై కేసీఆర్ సర్కారుకు 14 పేజీల్లో హైకోర్టు ఏం చెప్పింది?
By: Tupaki Desk | 23 Oct 2019 4:50 AM GMTమనోడి చలువతోనే కెనడా ప్రధానికి మళ్లీ పదవి..ఆర్టీసీ సమ్మె సాగుతోంది. బస్సులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలాంటివేళ.. ప్రజలకు కష్టం కలగకుండా ఉండాలని భావించే ప్రభుత్వం ఏం చేయాలో అలాంటివేమీ కేసీఆర్ సర్కారు చేయరన్న విమర్శ ఉంది. దీనికి బలం చేకూరేలా సీఎం కేసీఆర్ అండ్ కో వ్యవహారశైలి ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దాదాపు ఐదు రోజుల క్రితం (అక్టోబరు 18న) ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పరిష్కారం కోసం ఇరు వర్గాలు ఎలా వ్యవహరించాలన్న విషయం మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ.. తమ ఆలోచనల్ని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
సాంకేతికంగా ఉండే సమస్యల కారణంగా ఆ వివరాలు మంగళవారం నాటికి బయటకు వచ్చాయి. అప్పటివరకూ హైకోర్టు ఉత్తర్వుల కోసం తెలంగాణ ప్రభుత్వం వెయిట్ చేసే తీరు చూసినప్పుడు.. సమ్మెను పరిష్కరించే విషయంలో కేసీఆర్ సర్కార్ ఎలా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా ఉందని చెప్పాలి.
ఉత్తర్వులు వచ్చాక తగిన నిర్ణయం తీసుకుందామన్నట్లుగా కేసీఆర్ వ్యవహారశైలి ఉంది. మరి.. తాజాగా బయటకు వచ్చిన హైకోర్టు ఉత్తర్వుల్లో అసలేముంది? ప్రభుత్వానికి.. ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు ఏం చెప్పింది? అన్న విషయాల్లోకి వెళితే..
- ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం ఇరు వర్గాలు పట్టువిడుపుల ధోరణితో వ్యవహరించాలి. ఇద్దరూ ఒక మెట్టు దిగాలి. అటు కార్మిక సంఘాలు.. ఇటు ప్రభుత్వం మెట్టు దిగకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు.
- ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్.. జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి.. ఆర్టీసీ ఎండీలు చర్చలు జరపాలి.
- అక్టోబరు 28 నాటికి జరిపే తదుపరి విచారణ సమయానికి చర్చలు ఫలప్రదమై.. ఆర్టీసీ సమ్మె విరమణ జరుగుతుందని భావిస్తున్నాం.
- ప్రభుత్వం చర్చల ప్రక్రియను పర్యవేక్షించాలి. చర్చలతోనే ఎలాంటి సమస్యైనా పరిష్కారమవుతుంది.
- సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు లేవనెత్తిన పలు డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడి లేవు. వీటి విషయంలో ప్రభుత్వం చర్చలు జరపాలి. సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటిని ధర్మాసనం ప్రత్యేకంగా పేర్కొనటం గమనార్హం.
- ఆర్థిక అంశాలతో సంబంధం లేని వాటినే కాదు.. ఆర్థిక అంశాలతో ముడిపడిన కొన్ని డిమాండ్లు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయబద్ధంగా.. చట్టపరంగా చెల్లించాల్సిందే.
- రాజ్యాంగంలోని 14, 15, 16, 19, 21 అధికరణాల ప్రకారం కార్మికుల డిమాండ్లు ఆమోదించదగినవి.
- ఆర్టీసీ చట్టం చట్టం 1950లోని సెక్షన్ 19(1)(సి) - ఇతర సెక్షన్ల ప్రకారం ఆర్టీసీ సిబ్బందికి పని చేసేందుకు ఆరోగ్యకర వాతావరణం.. తగిన వేతనాలు.. సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉంది.
- రాష్ట్రంలోని పురుషులు, మహిళలు, పిల్లలను దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా చర్చలు జరపాలని ఆదేశిస్తున్నాం. ఈ నెల 28న జరిగే తదుపరి విచారణ నాటికి చర్చలపై సానుకూల సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం.
- కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించే నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కోర్టు తన న్యాయ పరిధికి లోబడి ఉంది. అందుకే యూనియన్ - జేఏసీల డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రానికి గానీ కార్పొరేషన్‌కు గానీ ఆదేశాలు ఇవ్వడం లేదు.
- సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం.