Begin typing your search above and press return to search.
నాలుగు గంటల సమీక్షలో సమ్మె మీద కేసీఆర్ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 23 Oct 2019 5:37 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పటికి 18 రోజులైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు.. మరిన్ని డిమాండ్ల సాధన కోసం రూల్ బుక్ ప్రకారం సమ్మె నోటీసు ఇచ్చి మరీ చేసిన సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కోపంగా ఉన్నారన్న విషయం తెలిసిందే.
సమ్మె అంతకంతకూ పెరుగుతున్నా.. ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నా.. ప్రత్యామ్నాయం పేరుతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. బస్సులు లేక ప్రజలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీ అధికారికంగా ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ముఖ్య అధికారులతో కలిపి కేసీఆర్ నాలుగు గంటల పాటు ఈ అంశంపై తొలిసారి రివ్యూ మీటింగ్ పెట్టారు.
ఈ సందర్భంగా సమావేశంలో తాము చర్చించిన విషయాలకు సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ ను సీఎంతో వెల్లడించింది. సమావేశంలో మాట్లాడుకున్న విషయాల్ని బయటకు పొక్కనీకుండా జాగ్రత్త పడింది ప్రభుత్వం. దీంతో.. సర్కారు రిలీజ్ చేసిన నోట్ మినహా మిగిలిన వివరాలు బయటకు రాలేదు. ఇంతకీ.. సీఎంవో విడుదల చేసిన నోట్ లో ఉన్న విషయాల్ని చూస్తే..
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం మినహా మిగిలిన అంశాల్ని పరిశీలించాలి. ఎందుకంటే.. కోర్టులో ఆర్టీసీ కార్మికుల తరఫు నాయకులు ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కచ్ఛిత డిమాండ్ లేదని ప్రకటించారు.
- ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 21 డిమాండ్లను పరిశీలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సంస్థకు చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ వేసింది.
- ఆరుగురు సభ్యులతో కమిటీ వేసినా.. కార్మికులతో చర్చలు జరిపే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆదారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కార్మికులు వారికి వారే వదులుకున్న నేపథ్యంలో ఇతర డిమాండ్లను పరిశీలించేందుకు రాష్ట్ర సర్కారు ఓకే చెప్పింది.
- కోర్టు కోరిన 21 అంశాల్ని అధ్యయనం చేయండి.
-కార్మిక సంఘాల ప్రోద్బలంతో జరుగుతున్న చట్ట వ్యతిరేకత సమ్మెకు కాంగ్రెస్.. బీజేపీలు మద్దతు తెలపటం అనైతికం.
- కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేస్తున్న తమపైన రార్దాంతం చేస్తున్న వైనాన్ని కేంద్రం వద్దకుతీసుకెళ్లాలి. ఈ విషయంపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రికి లేఖ రాయండి.