Begin typing your search above and press return to search.
ఓటుకు నోటు కేసులో రేవంత్ గన్ మ్యాన్ ఏం చెప్పారు?
By: Tupaki Desk | 7 July 2021 4:00 AM GMTకొన్నేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేసిన ఉదంతంగా ఓటుకు నోటు వ్యవహారం చెప్పాలి. తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేసేందుకు వీలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టేందుకు భారీ ప్రయత్నాలు జరగటం.. దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అండ్ కో విసిరిన ఉచ్చులోకి రేవంత్ రెడ్డి అడ్డంగా చిక్కుకోవటం.. వీడియో సాక్ష్యంతో సైతం బయటకు వచ్చి పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో రేవంత్ జైలుకు వెళ్లి.. కొన్నిరోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం కిందామీదా పడితే కానీ రాని పరిస్థితి.
ఇదంతా జరిగి కొన్నేళ్లు అయ్యింది. నాటి తీవ్రత ఇప్పుడు లేదు కూడా. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న రేవంత్.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎంపిక కావటమే కాదు.. ఈ రోజు (బుధవారం) ఆయన తన పదవీ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఇలాంటివేళలో.. మరోవైపు ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఓటుకు నోటు కేసును విచారిస్తోంది. స్టీఫెన్ సన్ గన్ మ్యాన్లు నీరజ్ రావు.. రఘునందన్ వాంగ్మూలాల్ని కోర్టు నమోదు చేసింది కూడా. తాజా విచారణకు ఉదయ్ సిన్హా.. సెబాస్టియన్లు కోర్టుకు రాగా.. రేవంత్.. సండ్ర వీరయ్యలు మాత్రం హాజరు కాలేదు.
తాజాగా జరిగిన విచారణలో రేవంత్ గన్ మ్యాన్ల వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. రేవంత్ కు చెందిన ముగ్గురు గన్ మ్యాన్లు ఉండగా.. వారిలో ఒకరు మినహా మిగిలిన ఇద్దరు హాజరయ్యారు. కోర్టు ఎదుట హాజరై.. వాంగ్మూలాన్ని ఇచ్చిన వారిలో వెంకట్ కుమార్.. రాజ్ కుమార్ లను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రేవంత్ కు చెందిన మరో గన్ మ్యాన్ మొహమ్మద్ అమీరుద్దీన్ మాత్రం కోర్టుకు రాలేదు. దీంతో.. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి 18 వరకు సాక్ష్యులను విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని న్యాయస్థానం నిర్ణయించింది.
విచారణ సందర్భంగా న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ గన్ మ్యాన్లు సమాధానాలు ఇచ్చారని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గన్ మ్యాన్లు ఇచ్చిన వాంగ్మూలం కారణంగా రేవంత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. కేసుకు కీలకమైన డబ్బులు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో గన్ మ్యాన్లు నేరం జరిగినట్లుగా చెబుతున్న చోట లేరన్న మాట వినిపిస్తున్నారు. రేవంత్ కు భద్రతకు కల్పించే వారు.. ఇంటి బయటే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. లోపల ఏం జరిగిందన్న ప్రశ్నలతో కొత్తగా రాబట్టేది ఏమీ ఉండదన్న మాట న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.