Begin typing your search above and press return to search.

మీరు చెప్పిన‌ ప‌ని చేయబోం: ప్ర‌ధాని మోడీకి తేల్చిచెప్పిన జెలెన్ స్కీ

By:  Tupaki Desk   |   5 Oct 2022 9:30 AM GMT
మీరు చెప్పిన‌ ప‌ని చేయబోం:  ప్ర‌ధాని మోడీకి తేల్చిచెప్పిన జెలెన్ స్కీ
X
ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ‌మై 8 నెల‌లు గ‌డిచినా దానికి ఇంకా ఎండ్ కార్డ్ ప‌డ‌లేదు. మొద‌ట్లో సులువుగా విజ‌యం సాధించేలా క‌నిపించింది.. ర‌ష్యా. ప్రాంతాల మీద ప్రాంతాలు, న‌గ‌రాల‌ను ఆక్ర‌మించుకుంటూ వెళ్లింది. వేల‌కొద్దీ మ‌నుషుల ప్రాణాల‌ను హ‌రించింది. భ‌వ‌నాల‌ను నేల‌మ‌ట్టం చేసింది.

అయితే రాను రాను ఉక్రెయిన్ లొంగ‌క‌పోగా బ‌లం పుంజుకుంటోంది. అమెరికా, ఇంగ్లండ్ త‌దిత‌ర దేశాలు అందించిన ఆయుధాల‌తో గ‌ట్టిగా పోరాడుతోంది. దీంతో ర‌ష్యా ఆఖ‌రి ప్ర‌య‌త్నంగా ఉక్రెయిన్ మీద అణ్వాయుధాల‌ను ప్రయోగిస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఒక ప్ర‌తిపాద‌న చేశారు. ఈ మేర‌కు జెలెన్ స్కీకి న‌రేంద్ర మోడీ ఫోన్ చేశారు. శత్రుత్వాన్ని వీడాల‌ని కోరారు. చ‌ర్చ‌లు, దౌత్య మార్గాల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని జెలెన్ స్కీకి సూచించారు.

అయితే మోడీ ప్ర‌తిపాద‌న‌ను జెలెన్ స్కీ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్ సార్వ‌భౌమాధికారానికి మ‌ద్దతు ఇచ్చినందుకు ప్ర‌ధాని మోడీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కాగా ఉక్రెయిన్‌, ర‌ష్యా యుద్ధంలో భార‌త్ చురుకైన పాత్ర పోషించ‌డం లేద‌ని జెలెన్ స్కీ గ‌తంలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలో పలుమార్లు ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాల‌కు భార‌త్ మ‌ద్ద‌తివ్వ‌లేదు. పైగా ఆ స‌మావేశాల‌కు గైర్హాజ‌రు అయ్యింది.

ఉక్రెయిన్ మాత్ర‌మే కాకుండా అమెరికా, త‌దిత‌ర పాశ్చాత దేశాలు భార‌త్ పై ప‌రోక్ష విమ‌ర్శ‌లు చేశాయి. ర‌ష్యాపై తాము ఆంక్ష‌లు విధిస్తే భార‌త్ మాత్రం ర‌ష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంద‌ని మండిప‌డ్డాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ గ‌ట్టిగా ఖండించింది. ఇంధ‌న అవ‌స‌రాల‌కు తాము విదేశాల మీదే ఆధార‌ప‌డుతున్నామ‌ని వెల్ల‌డించింది. ఎక్క‌డ ఆయిల్ త‌క్కువ‌గా వ‌స్తే అక్క‌డ ఆయిల్ కొనే త‌మ‌కు ఉంద‌ని తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.