Begin typing your search above and press return to search.
కర్ణాటక ఉప ఎన్నికలపై సర్వేలు ఏం చెబుతున్నాయ్?
By: Tupaki Desk | 7 Dec 2019 10:47 AM GMTకర్ణాటక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉన్న కీలకమైన ఉప ఎన్నికల్లో ముఖ్యమైన పోలింగ్ పూర్తి అయ్యింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తపరిచారు. ఇప్పుడు అందరి చూపులు తుది ఫలితం మీదనే ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఈ నెల తొమ్మిదిన అంటే సోమవారం మీదనే ఉన్నాయి.
జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న వేళ ఆ పార్టీలకు చెందిన పలువురు రాజీనామా చేయటంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాల్ని బీజేపీ గెలుచుకుంటే ప్రభుత్వానికి ఢోకా లేనట్లే. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటే మాత్రం అధికార బదిలీకి తెర తీసినట్లే. అదే జరిగితే నాటకీయ పరిణామాలు ఖాయమంటున్నారు.
పోలింగ్ పూర్తి అయ్యాక ముఖ్యమైన మీడియా సంస్థలు విడుదల చేసిన సర్వే రిపోర్టల ప్రకారం చూస్తే మాత్రం బీజేపీకి కచ్ఛితమైన మెజార్టీ ఉంటుందని తేల్చాయి. కర్ణాటక ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. అందుకే బీజేపీకి మెజార్టీ స్థానాలు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకున్నట్లు తేల్చారు. కాంగ్రెస్.. జేడీయూను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరంటున్నారు.
దీంతో.. ఎన్నికల ఫలితాలపై టెన్షన్ పడుతున్న బీజేపీ వర్గాలు సర్వే ఫలితాల్ని చూసి రిలాక్స్ అవుతుంటే.. కాంగ్రెస్, జేడీయూ నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇప్పటికి వెల్లడైన ఎన్నో సర్వే ఫలితాలు నిజం కాలేదన్నది మర్చిపోకూడదని చెబుతున్నారు. మొత్తంగా ప్రజాతీర్పు ఎలా ఉంటుందన్నది తేలేందుకు మరో రెండు రోజులు ఉండటంతో సోమవారం కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పక తప్పదు.
వివిధ మీడియా సంస్థల సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి..
% సి ఓటర్: బీజేపి(9 - 12 స్థానాలు), కాంగ్రెస్(3 - 6), జేడీఎస్‌కు (1 స్థానం)
% సువర్ణ ఛానల్: బీజేపీ (10 - 12), కాంగ్రెస్ (2 - 4), జేడీఎస్ (1 - 2 స్థానాలు)
% పబ్లిక్ టీవీ: బీజేపీ (8 -10), కాంగ్రెస్ (3 - 5), డీఎస్‌కు (1 - 2), ఇండిపెండెంట్ (1)
% దిగ్విజయ ఛానల్: బీజేపీ (9 - 11), కాంగ్రెస్‌కు (2 - 4), జేడీఎస్‌కు (2), ఇండిపెండెంట్‌కు (1)