Begin typing your search above and press return to search.

హుజూర్‌నగర్ ప్రచారానికి వచ్చి బాలయ్య ఏం చేస్తాడు బాబు..?

By:  Tupaki Desk   |   7 Oct 2019 10:39 AM GMT
హుజూర్‌నగర్ ప్రచారానికి వచ్చి బాలయ్య ఏం చేస్తాడు బాబు..?
X
తెలంగాణ రాజకీయాల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాక రేపుతున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలన్నీ హుజూర్ నగర్ బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇక వీటికి మేము పోటీ ఇస్తామని టీడీపీ, బీజేపీ సవాల్‌ విసురుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీ నేతలు ప్రచార బరిలో దిగారు. టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ కూడా అక్కడే తిష్ట వేశారు. కేసీఆర్ త్వరలో బహిరంగ సభలో పాల్గొనున్నారు.

టీఆర్ఎస్ గెలుపు కోసం ఆ పార్టీ నుంచే ఏకంగా 70 మంది కీల‌క నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీల తరుపున రాష్ట్ర నాయకులు ప్రచారం చేస్తుండగా...టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయి తరుపున ఎల్ రమణ, రావు లాంటి నేతలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కమ్మ ఓటు బ్యాంక్ కాస్తా ఎక్కువగానే గల హుజూర్ నగర్ ప్రచార బరిలో సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగుతున్నారు. అధినేత చంద్రబాబు ఆదేశాలతో బాలకృష్ణ ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీలోగా హుజూర్ నగర్ లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి.

నందమూరి బాలకృష్ణ ప్రచార సమయంలో నిజయోజకవర్గం పరిధిలో రోడ్‌షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. బాల‌య్య‌ను ఎలాగైనా ప్ర‌చారానికి పంపాల‌ని స్థానిక టీడీపీ నేత‌లు, తెలంగాణ టీడీపీ నేత‌లు బాబుపై ఒత్తిడి చేయ‌డంతోనే ఆయ‌న ప్ర‌చారం చేసేలా బాబు ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హుజూర్ నగర్ లో టీడీపీ గెలిచే ఛాన్స్ అసలు లేదు. ప్రధాన పోరు టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే జరుగుతుంది. ఈ తరుణంలో బాలయ్య ప్రచారానికొస్తే ఉపయోగం ఉండే అవకాశం లేదు. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బాలయ్య ప్రచారం చేస్తే ఏమైందో అందరికీ తెలుసు.

ఆయన ప్రచారం వల్ల పార్టీకి లాభం రాకపోగా, నష్టం ఎక్కువ జరిగింది. ఆయన స్పీచుల్లో ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడుతారో అర్ధం కాదు. దీని వల్ల పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోంది. బాల‌య్య‌ను ఆయ‌న అభిమానులు కేవ‌లం సినీ హీరోగానే చూస్తున్నారే త‌ప్పా... రాజ‌కీయ నాయ‌కుడిగా చూడ‌డం లేదు. ఇది ఇప్ప‌టికే చాలా సార్లు ఫ్రూవ్ అయ్యింది కూడా.. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు బాలయ్యని హుజూర్ నగర్ పంపి ఏం సాధిస్తారో తెలియడం లేదు.