Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూర్ లో జ‌గ‌న్ ఏం చెప్తారో ?

By:  Tupaki Desk   |   2 Jun 2022 5:30 AM GMT
ఢిల్లీ టూర్ లో  జ‌గ‌న్ ఏం చెప్తారో ?
X
గ‌త ప‌ర్య‌ట‌న‌లో హోదా ఊసు లేదు. నిధుల ఊసు లేదు. దాంతో నిరాశ‌లో ఆంధ్రులు ఉస్సూరుమ‌న్నారు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ ఏం మాట్లాడ‌తారు.. పొరుగు రాష్ట్రం విద్యుత్ బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది వాటిపై కూడా మాట్లాడ‌తారా? క‌నీసం విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు చేయండ‌ని అడ‌గ‌బోతున్నారా?

ఇవాళ ఢిల్లీ డీల్స్ కు ప్ర‌యార్టీ ఇవ్వ‌నున్నారు జ‌గ‌న్. మ‌ధ్యాహ్నం వేళ‌కు ఆయ‌న మోడీతోనూ ఇత‌రుల‌తోనూ భేటీ కానున్నారు.ఆ విధంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం వ‌చ్చేసింది. ఒన్ జ‌న‌ప‌థ్ లో మోడీతో భేటీ సంద‌ర్భంగా ఏం చెప్ప‌నున్నారు అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం.

వాస్త‌వానికి దావోస్ ప‌ర్య‌ట‌న అనంత‌రం చేప‌డుతున్న ఢిల్లీ ప‌ర్య‌ట‌న కావ‌డంతో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ జగ‌న్, మోడీ భేటీ అత్యావ‌శ్య‌క ప‌రిణామంగానే చ‌ర్చ‌కు నోచుకుంటోంది. దావోస్ వెళ్లారు స‌రే! అక్క‌డికి వెళ్లాక ఏం మాట్లాడారు.. ఏయే అంశాల‌పై చ‌ర్చించారు..ముఖ్యంఒగా పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఏం చెప్పి వ‌చ్చారు అన్న‌వి ప్ర‌ధానికి ఏపీ వ‌ర్గాలు వివ‌రిస్తాయా?

అప్పుల మాటేంటి?ఏప్రిల్ నెల ఐదున సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేశారు. ఆ సంద‌ర్భంగా కొన్ని విష‌యాలు ప్ర‌ధానితో చ‌ర్చించారు. కానీ ఆ రోజు ప్ర‌త్యేక హోదా ఊసే లేకుండా భేటీ ముగిసింది. పోనీ హోదా గురించి ఎత్త‌లేదు.. ఏయే విష‌యాల‌పై మాట్లాడారు అంటే వాటిపై కూడా మీడియాకు చెప్ప‌కుండానే వెళ్లిపోయారు.

ఇప్పుడు జీతాలు ఇచ్చే స‌మ‌యంలో జ‌గ‌న్ ఢిల్లీకి వెళ్తున్నారు. పొరుగున ఉన్న తె లంగాణ క‌న్నా ఏపీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండ‌డంతో ఇప్ప‌టికే 28 వేల కోట్ల రూపాయల అప్పుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది కేంద్రం. ఇది ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన లెక్క. ఆ విధంగా తెలంగాణ కూడా 14 వేల కోట్ల అప్పు అడిగితే ఇవ్వ‌డం లేదు.

సో.. అప్పుల విష‌య‌మై కేంద్రం ఏపీ వైపే ఎక్కువ‌గా ఫేవ‌ర్ గా ఉంది. క‌నుక ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని కొత్త అప్పుల కోసం కానీ లేదా కేంద్రం వివిధ ప‌థ‌కాల రూపంలో ఇవ్వాల్సిన నిధుల‌పై కానీ ప్ర‌ధానితో జ‌గ‌న్ మాట్లాడ‌తారా ? లేదా రాజ్య స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనో, రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలోనో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సాగ‌నుందా?