Begin typing your search above and press return to search.
'ఎల్ఐసీ' గురించి క్రిసిల్ నివేదిక ఏం చెప్పిందంటే?
By: Tupaki Desk | 7 Feb 2022 6:32 AM GMTఇటీవల కాలంలో తరచూ ఎల్ఐసీ మీద మీడియాలోనూ.. ఇటు ప్రజల్లోనూ.. అటు రాజకీయ వర్గాలకు ముడిసరుకుగా మారింది. ఓపక్క ఎల్ఐసీని అమ్మేస్తున్నారంటూ తీవ్రంగా తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు వెళుతున్న వైనం తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సంస్థకు సంబంధించి క్రిసిల్ సంస్థ తన నివేదికను విడుదల చేసింది.
దీన్ని చూస్తే.. ఎల్ఐసీ ఆర్థికంగా ఎంత బలంగా ఉందన్న విషయంతో పాటు.. దాని విలువ.. స్థాయి తదితర విషయాలన్ని ఇట్టే తెలిసిపోతాయి. తాజాగా విడుదలైన క్రిసిల్ నివేదిక ఎల్ఐసీ సంస్థ గురించి ఏం చెప్పిందన్నది దాని మాటల్లోనే చూస్తే..
- ఆస్తుల పరంగా చూస్తే ఎల్ఐసీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరో సంస్థగా ఉంది. దాని మొత్తం ఆస్తుల విలువ మన రూపాయిల్లో చూస్తే.. రూ.39.15 లక్షల కోట్లు. మొదటి స్థానంలో పింగ్ యాన్ 1.38లక్షల కోట్ల డాలర్లు కాగా.. మెట్ లైఫ్ 79,515కోట్ల డాలర్లు.. నిప్పాన్ లైఫ్ 70,500 కోట్ల డాలర్లు.. అవివా లైఫ్ ఆఫ్ ఇంగ్లండ్ 65,734 కోట్ల డాలర్లు.. చైనా లైఫ్ లు 61,630 డాలర్లు తొలి ఐదు స్థానాల్లో ఉండటం గమనార్హం.
- అత్యధిక ఆర్ ఓఈ అందిస్తున్న సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఎల్ ఐసీ 82 శాతంతో అగ్రస్థానంలో ఉంది. పింగ్ యాన్ ఇన్సూరెన్స్ ఆఫ్ చైనా 19.5 శాతం.. అవివా 14.8 శాతం.. చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 11.9 శాతం మాత్రమే అందిస్తున్నాయి.
- జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద బీమా సంస్థగా ఎల్ ఐసీ నిలచింది. ఈక్విటీపై 82 శాతం ప్రతిఫలాన్ని అందిస్తోంది. 2000 సంవత్సరానికి ముందు ఎల్ఐసీ మార్కెట్ వాటా 100 శాతం ఉండగా.. 2016 నాటికి 71.8 శాతానికి వచ్చిందని.. 2020 నాటికి 64.1 శాతానికి దిగినట్లుగా నివేదిక పేర్కొంది.
- దేశంలో రెండో అతి పెద్ద బీమా సంస్థ అయిన ఎస్ బీఐ లైఫ్ మార్కెట్ వాటా 2016లో 5 శాతం ఉంటే.. 2020 నాటికి 8 శాతానికి పెరిగింది. తొలి.. రెండో స్థానంలో ఉన్న బీమా సంస్థ మార్కెట్ వాటా పరంగా ఇంత తేడా మరే దేశంలోనూ
- సుమారు రూ.4.23 లక్షల కోట్ల స్థూల రిటెన్ ప్రీమియంతో ఎల్ఐసీ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది.
- 2021 మార్చి నాటికి ఎల్ఐసీకి 13.5 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. దేశంలో ఉన్న మొత్తం ఏజెంట్ నెట్ వర్కులో ఈ సంస్థ వాటానే 55 శాతం కావటం గమనార్హం.