Begin typing your search above and press return to search.
సీఎంను ‘తుల్లా’ పదానికి అర్థం చెప్పమన్న కోర్టు
By: Tupaki Desk | 13 July 2016 3:30 PM GMTఇప్పుడున్న సమస్యలు సరిపోనట్లుగా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సరికొత్త కష్టం వచ్చి పడింది. ఈ మధ్యన అజయ్ కుమార్ తనేజా అనే పోలీస్ కానిస్టేబుల్ మీద ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల మీద పరువునష్టం కేసు ఒకటి నమోదైంది. సీఎం తనను తిట్టారంటూ ఒక కానిస్టేబుల్ కోర్టుకుఎక్కటం లాంటివి దేశంలో మరెక్కడా కనిపించవు. నిజానికి.. ఇదొక్కటే కాదు..ఇలాంటి చిత్రవిచిత్రమైన కేసులు ఢిల్లీలో నమోదు అవుతుంటాయి. మొన్నటికిమొన్న తాగునీటి సమస్యల గురించి మహిళలు ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే వద్దకువెళ్లటం.. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కేసులు నమోదైన పరిస్థితి.
ఎమ్మెల్యేల మీద మహిళలు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా ముఖ్యమంత్రి మీద కానిస్టేబుల్ కేసు పెట్టటం.. అది కాస్తా కోర్టు విచారణకు వచ్చి ముఖ్యమంత్రికి సమన్లు జారీ చేసే వరకూ వెళ్లింది. ముఖ్యమంత్రి స్పందించి హైకోర్టును ఆశ్రయించటంతో దిగువ కోర్టు ఇచ్చిన సమన్లను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
హమ్మయ్య.. సమస్య ఒక కొలిక్కి వచ్చిందన్నంతలో కోర్టు నుంచి ఊహించనిప్రశ్న ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురైంది. అదేమంటే.. ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్న‘‘తుల్లా’’ అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలంటూ తాజాగా ఢిల్లీ హైకోర్టు కోరింది. తమ తదుపరి విచారణ సమయానికి తుల్లా పదానికి అర్థం చెప్పాలంది. ఇదిలా ఉంటే.. సీఎం మీద కేసు పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. ‘తుల్లా’ అనే పదం చాలా తీవ్రమైనదని.. ఢిల్లీ పోలీసులను ఉద్దేశించి చెబుతూ.. ఆ పదాన్ని ఉపయోగించటం తననుబాధించిందని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో కోర్టు అడిగిన ‘తుల్లా’ అనేపదానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏం అర్థం చెబుతారో చూడాలి. ఏది ఏమైనా చిత్రవిచిత్రమైన పరిణామాలన్ని ఢిల్లీ అధికారపక్షానికే ఎదురుకావటం గమనార్హం.