Begin typing your search above and press return to search.

ఐటీ త‌నిఖీల వేళ దిన‌క‌ర‌న్ ఇంట్లో..

By:  Tupaki Desk   |   10 Nov 2017 6:50 AM GMT
ఐటీ త‌నిఖీల వేళ దిన‌క‌ర‌న్ ఇంట్లో..
X
కొంద‌రు అనుకున్న‌ట్లే జ‌రిగింది. త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై మ‌హాన‌గ‌రానికి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. డీఎంకే చీఫ్ క‌రుణానిధిని క‌లవ‌టం.. ఆయ‌న చేతిని అదేప‌నిగా ప‌ది నిమిషాలు ప‌ట్టుకొని ఉండ‌టం.. మా ఇంటికి వ‌చ్చి రెస్ట్ తీసుకోవ‌చ్చుగా అంటూ ఆఫ‌ర్ ఇవ్వ‌టం లాంటివి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌నిఖీల జోరు చిన్న‌మ్మ వ‌ర్గం మీద ప‌క్కా అన్న భావ‌న కొంద‌రువ్య‌క్తం చేశారు.

ఇందుకు త‌గ్గ‌ట్లే గురువారం చిన్న‌మ్మ అండ్ కోకు చెందిన ఇళ్ల మీద ఐటీ త‌నిఖీలు భారీగా చోటు చేసుకున్నాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రి చొప్పున త‌నిఖీల మీద త‌నిఖీల‌కు ఐటీ అధికారులు ప్లాన్ చేశారు. ప్లాన్ చేయ‌టం త‌ప్పేం కాకున్నా.. ఆ స‌మాచారం విన్నంత‌నే ఆగ‌మాగం అయిపోవ‌టం మామూలుగా జ‌రుగుతుంది. కానీ.. చిన్న‌మ్మ బంధువు దిన‌క‌ర‌న్ మాత్రం ఎలాంటి త్రోటుపాటుకు గురి కాలేద‌ట‌. అస్స‌లు టెన్ష‌నే తీసుకోలేద‌ట‌.

ఒక‌రి త‌ర్వాత ఒకరింట్లో ఐటీ శాఖ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా స‌మాచారం అందుతున్నా ఆయ‌న అస్స‌లుప‌ట్టించుకోలేద‌ట‌. త‌న మానాన తాను త‌న భార్య‌తో క‌లిసి గోపూజ‌లో బిజీగా ఉన్నార‌ట‌.

పూజ పూర్తి అయిన వేళ‌.. క‌ర్నూర హార‌తి తీసుకునే వేళ‌లో..ఐటీ అధికారి ఒక‌రు ఇంటికి వ‌చ్చార‌ట‌. పావు గంట త‌ర్వాత ఆయ‌న తిరిగి వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీ లాంటి నేత‌లో లెక్క తేడా వ‌చ్చిన త‌ర్వాత త‌నిఖీలు జ‌రుగుతాయ‌న్న అంచ‌నాను చిన్న‌మ్మ వేయ‌కుండా ఉంటుందా? ఒక‌వేళ అలా జ‌రిగితే ఏం చేయాలి? ఎలా వ్య‌వ‌హ‌రించాలి? అన్న దానికి సంబంధించి మేనేజ్ మెంట్ రెఢీగా ఉండే ఉంటుంది. అనుకోనిది జ‌రిగితే ఆశ్చ‌ర్యం కానీ.. అనుకున్న‌దే జ‌రిగితే హ‌డావుడి ఎందుకు ఉంటుంది. అందుకే కాబోలు.. ఐటీ త‌నిఖీలు జ‌రుగుతున్నాయ‌న్న స‌మాచారం అందినా.. దిన‌క‌ర‌న్ అంత తాపీగా ఉండ‌గ‌లిగారేమో?