Begin typing your search above and press return to search.
రాత్రికి రాత్రి ఏం జరిగింది? మహా ట్విస్ట్ ఏలా?
By: Tupaki Desk | 23 Nov 2019 12:10 PM GMTమహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్ ఎలా సాధ్యమైంది? తెర వెనుక అసలేం జరిగింది? రాత్రికి రాత్రి పరిణామాలు ఎందుకు మారిపోయాయి? గంటల్లో తన మాటను పవార్ ఎందుకు మార్చేశారు? ఏ శక్తుల్ని ఆయన్ను ప్రభావితం చేశాయి? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది.
చర్చలు జరుగుతున్నాయి. కీలక భేటీలు ఒకటి తర్వాత ఒకటి పూర్తి అవుతున్నాయి. మిగిలింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే అనుకున్నంతలో ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సేన కలను భగ్నం చేస్తూ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ముంబయి మహా నగర మేయర్ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకున్న ఆనందంలో మురిసిపోయిన శివసేనకు.. ఆ సంతోషంలో ఉండగానే దిమ్మ తిరిగే షాకిచ్చేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటులో అంతులేని ఆలస్యం చోటు చేసుకుంటున్న వేళ.. మేయర్ పదవి సేనకు వెళ్లిన నేపథ్యంలో.. ఇదే రీతిలో చూస్తూ ఉండిపోతే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది.
రాత్రికి రాత్రి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన.. బయటకు పొక్కకుండా పూర్తి చేసింది. ప్రభుత్వ ఏర్పాటు అంశం ఏమాత్రం బయటకు పొక్కినా.. తేడా వచ్చే అవకాశం ఉందన్న భావనతో గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్త పడ్డారు.
ఉద్దవ్ ఠాక్రే వెళ్లి మహారాష్ట్ర సీఎం సీటులో కూర్చోవటమే తరువాయి అనుకుంటున్న వేళ.. ఊహించని రీతిలో ఎంట్రీ ఇచ్చిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. తాజా ఎపిసోడ్ ను చూసిన వారు ఎవరైనా.. రాష్ట్రం ఏదైనా తమ చేతికి అధికారం వచ్చే అవకాశం ఏ మాత్రం ఉన్నా.. దాన్ని వదిలిపెట్టరన్న విషయాన్ని మోడీషాలు నిరూపించారని చెప్పక తప్పదు.
రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయిన సందర్భంగా రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపినట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని ఎన్సీపీ ఖండించింది. కానీ.. ఇప్పుడు ఆ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయిన చెప్పొచ్చు. అత్యుత్తమ స్థానాన్ని తాను చేపట్టాలని పవార్ కు ఎప్పటి నుంచో కల ఉంది. సేనతో చేతులు కలిపితే ప్రభుత్వ ఏర్పాటు తప్పించి ఇంకేమీ ఉండదు. అదే.. మోడీతో చేతులు కలిపితే.. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యమే కాదు.. అన్ని అనుకున్నట్లు జరిగితే తాను రాష్ట్రపతి కావొచ్చన్న ఆశే.. తాజా ట్విస్ట్ కు కారణంగా భావిస్తున్నారు. మరి.. పవార్ భవిష్యత్తు ఎలా ఉండనుందన్నది కాలమే చెప్పాలి.