Begin typing your search above and press return to search.
జర్మనీలో తెలంగాణ విద్యార్థికి ఏం జరిగింది
By: Tupaki Desk | 11 May 2022 3:29 AM GMTఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు నదిలో గల్లంతయ్యాడు. కరిమాబాద్ కు చెందిన కడారి పరుశరాములు, వనమాల దంపతుల కుమారుడు అఖిల్ (26) ఐదేళ్ల క్రితం మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లాడు.
రెండు రోజుల క్రితం పరీక్షలన్నీ పూర్తి కావడంతో ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. మొబైల్ లో నది ఒడ్డున సెల్ఫీ తీసుకుంటుండగా.. అఖిల్ జారీ నీళ్లలో పడి గల్లంతయ్యాడని తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం అందించారు. దీంతో అతడి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అఖిల్ ఆచూకీ కోసం ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అఖిల్ విషయాన్ని ఎమ్మెల్యే నరేందర్ స్వయంగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి జర్మనీ అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాలని జర్మనీ అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు.
అఖిల్ జర్మనీలోని హోట్టోవన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. మూడేళ్లుగా అక్కడే ఉంటున్న అఖిల్ సోలార్ ఎనర్జీలో ఫైనలియర్ చదువుతున్నాడు. అఖిల్ తండ్రి కడారి పరుశురాములు వరంగల్ లో మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కుమారుడి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి జర్మనీ పంపించామని.. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా నీటిలో గల్లంతు కావడంతో పరుశురాములు కుటుంబం ఆందోళన చెందుతోంది.
మరోవైపు అఖిల్ సోదరి తన సోదరుడి ఆచూకీ, వివరాలు తెలిపేందుకు సాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో కోరగా.. ఆయనత వంతు సాయం చేస్తానని ప్రకటించారు.