Begin typing your search above and press return to search.

అసలు తిరుపతి రోడ్డుషో లో ఏమి జరిగింది ?

By:  Tupaki Desk   |   13 April 2021 6:30 AM GMT
అసలు తిరుపతి రోడ్డుషో లో ఏమి జరిగింది ?
X
తిరుపతి రోడ్డుషోలో చంద్రబాబునాయుడుపై రాళ్ళవర్షం...ఇలాంటి ఘటనలు జరగటం నిజంగానే దురదృష్టం. అయితే నిజంగానే చంద్రబాబుపై రాళ్ళదాడి జరిగిందా ? లేదా ? అన్నదే ప్రధానమైన ప్రశ్న. సోమవారం రాత్రి చంద్రబాబు తిరుపతిలో రోడ్డు షో నిర్వహిస్తున్న సమయంలో ఓ కార్యకర్తపై రాయిపడిందట. దాంతో చంద్రబాబు నానా రచ్చ మొదలుపెట్టేశారు. తనను టార్గెట్ చేసుకునే అధికార వైసీపీ రాళ్ళదాడి చేయించిందని చంద్రబాబు ఆరోపణలు చేశారు.

అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ కో మాత్రం జరిగిన ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీడీపీకి మద్దతిచ్చే మీడియా కూడా వైసీపీనే చంద్రబాబుపై రాళ్ళదాడి చేయించిందని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబు వాహనంపై నుండి మట్లాడుతున్న సమయంలో పై నుండి ఒకరాయి వచ్చి పడిందని మాత్రమే చెప్పింది. అదికూడా పడినరాయి చంద్రబాబుపైన కాదు ఎవరో కార్యకర్తపై పడింది. ఆ రాయిని తెప్పించుకుని అందరికీ చూపించి తనపైనే రాళ్ళదాడి జరిగినట్లుగా చంద్రబాబు సీన్ క్రియేట్ చేశారు.

అయితే ఇదే సమయంలో జగన్ మీడియా ఏమో టీడీపీ కార్యకర్తల తోపులాటలో ఓ రాయి మహిళపై పడిందని చెప్పింది. మహిళ ఫిర్యాదు చేయగానే ఆ రాయిని చంద్రబాబు తెప్పించుకున్నారట. ఇంకెవరిపైనైనా రాళ్ళు పడ్డాయా అని వాకాబు చేశారట. దాంతో రోడ్డుపక్కనే ఉన్న రాళ్ళను కార్యకర్తలు తీసుకుని చూపించరాట. వెంటనే తనపై వైసీపీ నేతలు రాళ్ళదాడికి దిగినట్లు గోల మొదలుపెట్టేసినట్లు చెప్పింది. ఎస్పీ కార్యాలయంకు నడిచి వెళ్ళటం, అక్కడి నుండే జగన్మోహన్ రెడ్డికి వార్నింగులు ఇవ్వటం అందరు మీడియాలో చూసిందే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుపై రాళ్ళదాడి చేయాల్సినంత అవసరం ఎవరికుంది ? తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ గెలుపు అవకాశాలు దాదాపు లేవని అందరికీ తెలిసిందే. కాబట్టి రాళ్ళదాడి చేయించాల్సిన అవసరమైతే వైసీపీకి లేదు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన 4.94 లక్షల ఓట్లు తెచ్చుకోవటమే టార్గెట్ గా చంద్రబాబు పనిచేస్తున్నారు. మరన్ని ఓట్లు వస్తుందా రాదా అనేది అనుమానమే.

పెద్దిరెడ్డి ఇదే విషయమై మాట్లాడుతు తమకు డిపాజిట్లు తెచ్చుకునేందుకు చంద్రబాబే తనపై దాడి చేయించుకుని రాళ్ళదాడంటు డ్రామాలాడినట్లు ఆరోపణలు చేశారు. పడిన ఒక్కరాయి కూడా ఎవరో కార్యకర్తపై పడితే తనపైనే రాళ్ళదాడి జరిగినట్లు చంద్రబాబు ఎందుకు గోలచేశారంటు పెద్దిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.

వాహనంపై రాళ్ళదాడంటే చంద్రబాబు హయాంలో తిరుమలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కారుపై జరిగిన దాడిగా మంత్రి గుర్తుచేశారు. మొత్తానికి చంద్రబాబుపై రాళ్ళదాడి అన్నది ఉత్త డ్రామాగా పెద్దిరెడ్డి తేల్చేశారు. సరే ఎవరి వాదనలు ఎలాగున్నా జరిగిన ఘటనపై విచారణ జరిపి నిజాలు తేల్చటం ప్రభుత్వానికే మంచిది.