Begin typing your search above and press return to search.

గాంధీలో ఏమైంది? అర్థరాత్రి అంబులెన్సులు బారులు తీరాయెందుకు?

By:  Tupaki Desk   |   29 April 2021 9:30 AM GMT
గాంధీలో ఏమైంది? అర్థరాత్రి అంబులెన్సులు బారులు తీరాయెందుకు?
X
కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న గాంధీ ఆసుపత్రి.. అనూహ్యంగా మరోసారి న్యూస్ గా మారింది. బుధవారం రాత్రి మొదలు అర్థరాత్రి వరకు గాంధీలో అంబులెన్సులు బారులు తీరాయి. ఎప్పుడూ లేనంత రద్దీ ఎందుకు చోటు చేసుకుంది? అన్నది ప్రశ్నగా మారింది. అదే సమయంలో.. తమ వాళ్లను అడ్మిట్ చేసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేయటంతో.. పరిస్థితి అయోమయంగా మారింది.

ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు.. జిల్లాల నుంచి సీరియస్ కేసులన్ని గాంధీకి రావటమేనని చెబుతున్నారు. కరోనాకు వైద్యం చేసే ఆసుపత్రులు ఏ మాత్రం సీరియస్ గా ఉన్నా.. మరో ఆలోచన లేకుండా గాంధీకి రిఫర్ చేసి చేతులు దులుపుతున్నారు. అదే సమయంలో కొన్ని ఆసుపత్రులు మరో అడుగు ముందుకు వేసి.. మరో కొత్త ఎత్తు వేస్తున్నాయి.

ఇన్య్సూరెన్సు డబ్బులు ఉన్నంతవరకు వైద్యం చేయటం.. రోగి బంధువుల వద్ద డబ్బులు అయిపోయాయన్న వెంటనే.. తాము ఏమీ చేయలేమని.. గాంధీకి తీసుకెళ్లాలని చెబుతున్నారు. పాజిటివ్ ల సంఖ్య పెరగటం.. వివిధ ఆసుపత్రుల నుంచి వస్తున్న పేషెంట్లను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు గాంధీలో చేపట్టిన ప్రాసెస్ ఆలస్యం అయ్యేలా ఉండటంతో అంబులెన్సులు బారులు తీరాయి.

అదే సమయంలో కొందరు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ గాంధీ ఆసుపత్రిలో బెడ్లు ఫుల్ అయిపోయాయి. రోగుల్ని చేర్చుకోవటం లేదన్న దరిద్రపుగొట్టు ప్రచారాన్ని షురూ చేశారు. దీంతో.. గాంధీ వైద్యులు.. సూపరిండెంట్ కు వరుస ఫోన్లు రావటం.. గాంధీ ఫుల్ అయ్యిందంటే.. పరిస్థితి చాలా సీరియస్ గా ఉందన్న సంకేతాలు పోవటంతో పాటు.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో.. అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పుకోవటానికి వైద్యులు పడిన పాట్లు అన్నిఇన్ని కావని చెబుతున్నారు. బుధవారం అర్థరాత్రి గాంధీలోచోటు చేసుకున్న హడావుడి అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తోంది.