Begin typing your search above and press return to search.
డీఎండీకే అధినేత విజయకాంత్ కు ఏమైంది ... ఆందోళనలో కార్యకర్తలు , అసలు సంగతేమిటంటే ?
By: Tupaki Desk | 4 March 2021 10:38 AM GMT‘కెప్టెన్’ , ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ బుధవారం వైద్యపరీక్షలు చేసుకున్నారు. గత కొద్దినెలలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి తోడు ,ఈ మద్యే ఆయనకి కరోనా కూడా సోకింది. అయితే , ఆ తర్వాత కరోనా కి చికిత్స తీసుకోని బయటపడ్డారు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా , వైద్యుల సలహా మేరకు ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలను ఆయన సతీమణి, బావమరిది ఎల్ కే సుధేష్ చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు విజయకాంత్ నందంబాక్కంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి మాములు చెకప్స్ కోసం వెళ్లారు. ఆస్పత్రిలో సాధరణ పరీక్షలు చేపించుకొని , ఆ తర్వాత ఆస్పత్రి నుంచి కారులోఇంటికి వెళ్ళారు. విజయకాంత్ కు సాధారణ వైద్యపరీక్షలు జరిపామని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని ఆస్పత్రి నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా విజయకాంత్ కారులో ఇంటికి వెళ్లారు అని తెలుసుకున్న కొందరు మీడియా ప్రతినిధులు అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్లుపై చర్చలు జరిపేందుకు వెళుతున్నారని భావించి హుటాహుటిన సాలిగ్రామంలోని ఆయన నివాస గృహానికి తరలివెళ్ళారు. ఆ తర్వాత విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం నందంబాక్కం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళారని తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ,తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయకాంత్ ఆస్పత్రికి వెళ్లడం పట్ల డీఎండీకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆ తర్వాత ఆయనకు సాధారణ ఆరోగ్యపరీక్షలు నిర్వహించేందుకే ఆసుపత్రికి తీసుకెళ్లామని పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడటం , అలాగే అయన కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.