Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌ కాలికి గాయం...

By:  Tupaki Desk   |   30 Nov 2017 1:21 PM GMT
పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌ కాలికి గాయం...
X
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో మ‌హా పాద‌యాత్రకు శ్రీ‌కారం చుట్టిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి 300 కిలోమీట‌ర్ల రికార్డు మైలు రాయి చేరుకున్న సంద‌ర్భంగా స్వ‌ల్ప ఇబ్బందికి గుర‌య్యారు. ఆయ‌న కాలికి పొక్కులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న వైద్యుల స‌హాయం తీసుకున్నారు. జ‌గ‌న్ ఎడ‌మ‌కాలికి పొక్కులు రావ‌డంతో ఆయ‌నకు త‌గు చికిత్స చేసిన‌ట్లు వైసీపీ వ‌ర్గాలు వివ‌రించాయి.

కాగా, కాలికి పొక్కులు అవ‌డం - ఆయ‌న వైద్య సేవ‌లు పొందుతున్న విష‌యం తెలిసిన జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి రెడ్డి పాద‌యాత్ర‌కు వ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శించిన‌ట్లు స‌మాచారం. వైద్యుల ద్వారా అందుతున్న స‌హాయాన్ని అడిగి తెలుసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ‌ర్గాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా కాలికి తీసుకున్న చికిత్స ఫొటో వైర‌ల్ అయింది. మ‌రోవైపు లండ‌న్ నుంచి ప్ర‌త్యేకంగా ఓ అయింట్‌ మెంట్ తెప్పించి జ‌గ‌న్‌ కు వైద్య స‌హాయం అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం 22వ రోజున వైఎస్‌ జగన్‌ ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో పాదయాత్రను ప్రారంభించారు.వైఎస్‌ జగన్‌ ను కలసిన కారుమంచి గ్రామ మహిళలు తమ సమస్యలను చెప్పుకుని ఆవేదన చెందారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేశారని వాపోయారు. మహిళలే సమస్యలపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. మహానేత హయాం నాటి చదువుల విప్లవాన్ని మళ్లీ తీసుకొస్తానని అన్నారు.