Begin typing your search above and press return to search.

మోడీ సన్నిహితులకు ఏమైంది? వరుస పెట్టి రాజీనామాలు ఎందుకు?

By:  Tupaki Desk   |   6 Aug 2021 11:30 AM GMT
మోడీ సన్నిహితులకు ఏమైంది? వరుస పెట్టి రాజీనామాలు ఎందుకు?
X
దేశ పాలనా వ్యవస్థకు గుండెకాయ కేంద్ర సర్కారు అయితే.. దానికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసేది మాత్రం ప్రధానమంత్రి కార్యాలయం. అందులోని కీలక అధికారుల అడుగులు.. ప్రధాని గమనాన్ని నిర్దేశిస్తుంటాయి. ఒకవేళ ప్రధాని తప్పు చేస్తుంటే.. అందులో పూర్తి బాధ్యత ఆయనది మాత్రమే కాదు.. ఆయనకు సలహాదారులుగా ఉండే అధికారుల లోపంగా కూడా చెప్పాలి. అంతటి కీలకమైన పదవిలో ఉన్న వేళ.. తమ రిటైర్మంట్ కు కొద్ది నెలల ముందుగా తమ పదవులకు రాజీనామా చేయటంలో అర్థం లేదు. కానీ.. అలా జరిగిందంటే.. సమ్ థింగ్ రాంగ్ అని చెప్పాలి.

ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కార్యాలయంలో సాగుతున్న వరుస పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నెల వ్యవధిలో సీచెందిన ఇద్దరు కీలక అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు వారిలో ఒకరు సీనియర్ సలహాదారు అయిన అమర్జీత్ సిన్హా కాగా.. మరొకరు మాజీ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా కూడా తమ పదవికి రాజీనామా చేశారు.

పీఎంవోలో సామాజిక సంబంధాల్ని చూస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమర్జీత్ సిన్హా.. 2019లో గ్రామీణాభివ్రద్ధి కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం 2020 ఫిబ్రవరిలో ఆయన పీఎంవోలో సలహాదారుగా ఎన్నికయ్యారు. బిహార్ క్యాడర్ కు చెందిన ఈ అధికారి.. తన పదవీ విరమణకు మరో ఏడు నెలలు మిగిలి ఉండగానే తన పదవికి రాజీనామా ఎందుకు చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాము తీసుకునే నిర్ణయాలతో దేశాన్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉండి కూడా.. సింఫుల్ గా వదులుకోవటం వెనుకున్న కారణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయంగా ఇటీవల కాలంలో మోడీ ఫేం భారీగా పడిపోతున్న నేపథ్యంలో.. ఆయన వేసుకున్న ప్రణాళికలు అనుకున్నట్లుగా ముందుకు సాగకపోవటం.. తాము అనుకున్నట్లుగా పని చేసే వీలు తగ్గిపోవటం కూడా కారణమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా పీఎంవోలో ఏదో జరుగుతోందని.. దానికి సంబంధించిన వివరాలు బయటకు రావటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.