Begin typing your search above and press return to search.
నరసరావుపేటకు ఏమైంది? తెలుగు తల్లికి ఇంత అవమానమా?
By: Tupaki Desk | 30 Aug 2020 11:10 AM GMTఅమ్మ ఇంట్లో ఉంటే విలువ తెలీదు చాలామందికి. కానీ.. ఒకసారి దూరమైతే అమ్మ ఎంత అపురూపమో అర్థమవుతుంది. కన్నతల్లి విషయంలోనే కాదు.. తెలుగుజాతికి తల్లి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే. ఆంధ్రా ప్రాంతంలో ఉంటూ.. తమ గురించి.. తమ ప్రాంతం గురించి.. తెలుగు గురించి పట్టించుకోని వారు.. ఒక్కసారి రాష్ట్ర సరిహద్దులు దాటి పరాయిగడ్డ మీద అడుగు పెట్టినప్పుడు కానీ సొంత ప్రాంతం మీదా.. భాష మీదా ప్రేమాభిమానాలు పొంగిపోర్లుతాయి.
మేం చెప్పింది కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివితే మీకే అర్థమవుతుంది. మన ఎదురుగా దేశ ప్రధాని ఉండి.. ఆయనతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. సార్.. ఇవాళ తెలుగు భాషా దినోత్సవం.. అందుకే నేను తెలుగులో మాట్లాడతానన్నమాటను ఊహించగలమా? ఆ పని చేసింది ఒక తెలుగోడు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లాకుచెందిన విద్యార్థి టోనీ మనోజ్ కుమార్. భాష మీదా.. తెలుగుతల్లి మీద తనకున్న ప్రేమాభిమానాల్ని దేశ ప్రధాని సాక్షిగా ప్రదర్శించారు.
కట్ చేస్తే..అదే రోజున గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకున్న వైనం తెలిస్తే ఒళ్లు మండక మానదు. తెలుగు జాతికి మూలమైన అమ్మపుట్టిన రోజును ఘనంగా జరుపుకోవాల్సింది పోయి.. ఊళ్లో ఉన్న విగ్రహాన్ని శుభ్రం చేసి.. పూలదండలతో ముస్తాబు చేయలేని తనాన్ని ఏమనాలి? ఎవరిని నిందించాలి?
తెలుగు భాషా దినోత్సవం రోజున అమ్మను తలచుకోవటం.. ఆమె విగ్రహానికి పూలదండ వేయాల్సిన కనీస సంస్కారం నరసరావుపేటకు చెందిన నేతలు.. అధికారులకు లేకుండాపోవటం ఏమిటన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని స్టేషన్ రోడ్ లో ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని ఎవరూ పట్టించుకోని వైనం పై విస్మయం వ్యక్తమవుతోంది.
గతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేదని చెబుతున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగుతల్లి విగ్రహాన్ని ముస్తాబు చేసే వైనానికి భిన్నంగా తాజా పరిణామాలు చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం? ఇంతకు మించిన అవమానం ఇంకేమైనా ఉంటుందా? నరసరావుపేట వాసులు ఇప్పటికే కళ్లు తెరవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.