Begin typing your search above and press return to search.
ఆ నేతలు ఏమయ్యారు.. ఇక, రాజకీయం ముగిసినట్టేనా?
By: Tupaki Desk | 17 May 2022 3:29 AM GMTఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగారు. పార్టీలు ఏవైనా.. వారు ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పారు. అయితే.. గత కొన్నాళ్లుగా వారు సైలెంట్ అయ్యారు. మరి వారు రాజకీయాల్లో ఉన్నట్టా.. లేనట్టా.. అసలు ఏం జరుగుతోంది. కీలకమైన ఎన్నికల ముంగిట వారి కోసం.. ఆయా పార్టీలు ఎదురు చూస్తుండడం.. ఆయా నేతలు.. మౌనంగా ఉండడం.. ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది.
కావూరి సాంబశివరావు..
పార్లమెంటు సభ్యుడుగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కావూరి సాంబశివరావు కొన్నాళ్ళ క్రితం కాంగ్రెస్‌ను వీడి కమల దళంలో చేరారు. తన పాత అనుచరవర్గాన్ని సైతం బీజేపీలో చేర్చేందుకు ప్రయత్నించారు. తన కంపెనీ పరం గా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలో కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగారు. కొద్ది మాసాలుగా ఆయన పక్షవాతంతో బాధప డుతూ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. దీంతో ఈయన రాజకీయం ముగిసినట్టేనని అంటున్నారు.
మాగంటి బాబు..
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో ఏలూరు నుంచి ఢిల్లీ వరకు ఎగబాకిన మాగంటి బాబుది ఒక హిస్టరీ. ఈయన కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘ రాజకీయప్రస్థానం ఈ కుటుంబం సొంతం. అయితే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఆయన టీడీపీకి దూరమయ్యారు. అంతేకాదు.. కేవలం ఏడాదిలోపే ఇద్దరు కుమారులను కోల్పోయి ఆయన మానసికం గా కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నారు. క్రియాశీల రాజకీయాల కు దూరంగా ఉన్నారు. గడిచిన ఏడాదిన్నరగా ఆయన తెలుగుదేశం వ్యవహారాల్లో ఏ మాత్రం పాలు పంచుకోవ డం లేదు. కోల్పోయిన కుమారుల సంవత్సరీకాలు పూర్త యిన తరువాతే తిరిగి రాజకీయాల్లో పుంజుకుంటారనేది ఆయన అనుచరుల మాట. అయితే.. మాగంటి క్రీయాశీలత కోసం టీడీపీ ఎదురు చూస్తుండడం కొసమెరుపు.
కనుమూరి బాపిరాజు
ఎమ్మెల్యేగా, ఎంపీగా ఒకప్పుడు కాంగ్రెస్‌లో అందరి మన్ననలు పొంది టీటీడీ చైర్మన్‌గా రాణించి జాతీయ స్థాయిలో నే ఓ వెలుగు వెలిగిన కనుమూరి బాపిరాజు ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయినప్పటికీ క్రియాశీల రాజకీయాలకు ఆయన అంటీముట్టనట్టుగానే మిగిలారు. తన స్వగ్రామం అయిన భీమవరంలో కొన్నాళ్ళు, మిగతా ప్రాంతాల్లో మరికొన్నాళ్ళు ఉంటున్నారు. ఒకప్పుడు నరసాపురం ఎంపీ గా ఆయనను వైసీపీ ప్రతిపాదించినా దీనికి ఆయన సున్ని తంగా తిరస్కరించారు. పార్టీలు మారడం తనకు ఇష్టం లేదన్నట్టు బాపిరాజు వ్యవహరించారు.
కరాటం రాంబాబు
ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. ఈయన సీనియర్ నాయకుడు. మెట్ట ప్రాంతంలో తిరుగులేని నేతగా దశాబ్దాలపాటు ఆధిపత్యం సాగించిన మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ఈ మధ్యన కాస్తంత వెనక్కి తగ్గినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి ఎంపీగా రంగంలోకి దింపేందుకు ప్రముఖ పార్టీలన్నీ ప్రయత్నించాయి. అయినప్పటికీ రాంబాబు దీనిపై ఆసక్తి ప్రదర్శించలేదు. ఒక సామాజికవర్గం పెద్దగా ఇప్పటికీ అందరికీ చిరపరిచితుడే. జనసేన కీలక అంశాల్లో ఆయన సూచనలను ఆ పార్టీ ఇప్పటికే స్వీకరిస్తున్నట్టు చెబుతున్నారు.
వట్టి వసంత కుమార్..
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గడిచిన పదేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే మిగి లారు. ఇప్పుడు ఆయన వైజాగ్‌లో ఉంటున్నారు. అయిన ప్పటికీ ఆయనంటే అభిమానం ఉన్న వారంతా రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలో ఆయన సలహాలను స్వీకరిస్తూనే ఉన్నారు.
అంజిబాబు..
భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మౌనం దాల్చారు. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు రాజకీయ ఎత్తుగడను బట్టే తదుపరి అడుగులు ఉంటాయని భావిస్తున్నారు. టీడీపీలో ఉన్నప్ప టికీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాత్ర తగ్గింది. పీఆర్‌పీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన ఈలి నాని ఈ మధ్యన తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌లలో ఎక్కువ కాలం రాజకీయాలకతీతంగా కాలం గడిపేస్తున్నారు.
శేషారావు..
నిడదవోలులో వరుసగా విజయాలు సాధించిన మాజీ ఎమ్మెల్యే బూరుగు పల్లి శేషారావు గత ఎన్నికల అనంతరం నీరుగారిపోయారు. టీడీపీలో తనకు అవకాశం ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. వయసు పైబడినా మాజీలు పెండ్యాల వెంకట కృష్ణారావు, కొండ్రెడ్డి విశ్వనాథం, మరడాని రంగారావు వంటి వారెందరో క్రియాశీలక రాజకీయా ల్లో తిరిగి రావాలని కోరుకునే వారెందరో ఉన్నారు.
అంబికా కృష్ణ
ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కైకలూరులో సీనియర్ నేత డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కమలదళంలోనే ఉన్నారు. అయితే.. వీరు కూడా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీరిపై ఎలాంటి ఆరోపణలు లేక పోవడం. పైగా.. వీరు మళ్లీ యాక్టివ్ కావాలని కోరుతుండడం. మరి ఏం చేస్తారో చూడాలి.