Begin typing your search above and press return to search.

ఇంటర్నెట్ ఆపేస్తే ఇన్ని నష్టాలా?

By:  Tupaki Desk   |   31 Oct 2016 3:27 AM GMT
ఇంటర్నెట్ ఆపేస్తే ఇన్ని నష్టాలా?
X
ఇంటర్నెట్ విశ్వవ్యాప్తమైంది. దాదాపుగా ప్రతి ఇంటికీ చేరింది. మొబైల్ ఇంటర్నెట్ వాడకంతో జనానికి బాగా చేరువైన దీని సహాయంతో రోజువారీ పనులూ చాలావరకు చక్కబెడుతున్నారు. ఆఫీసులయితే ఇంటర్నెట్ పై ఆధారపడనవి ఏవీ ఉండవేమో. అంతగా అవసరమైన ఇంటర్నెట్ ఒక్క సెకను ఆగితే జరిగే నష్టం ఎంతో తెలుసా.. ? ఆ లెక్క మామూలుగా లేదు.

- ఇంటర్నెట్ ఒక్క సెకను పాటు ఆగిపోతే 25,30,480 ఈమెయిళ్ల ట్రాన్సఫర్ ఆగిపోతుంది.

- 40 వేల జీబీ డాటా మార్పిడికి ఆటంకమేర్పడుతుంది.

- ఒక్క భారత్ లోనే 2015-16 మధ్య ఇంటర్నెట్ అంతరాయాల వల్ల రూ.6,585 కోట్ల నష్టమేర్పడింది. ఇది జీడీపీకి కలిగిన నష్టం మాత్రమే. బ్యాంకింగ్ - మేన్ పవర్ లాస్ వంటివన్నీ దీనికి అదనం.

అసలెందుకు ప్రభుత్వాలు ఆపేస్తున్నాయి..

అల్లర్లు జరిగేటప్పుడు - కొన్ని సార్లు పరీక్షల సమయాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నాయి. కశ్మీర్‌ లో అశాంతి నెలకొనడంతో ప్రభుత్వం మూడు నెలలుగా పలుమార్లు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసింది. అల్లర్లను మరింత పెంచేలా సోషల్‌ మీడియాలో ప్రచారం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు.

- కశ్మీర్‌ ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత కారణంగా అక్కడ ఐటీ రంగానికి విఘాతమేర్పడింది. పలు సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సుమారు 7 వేల మంది ఉద్యోగాలకు కోత పడింది.

- 2015 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 37 సార్లు వివిధ ప్రాంతాల్లో ఈ సేవలు ఆపేశారు.

- 2016లోనే ఇంతవరకు 22సార్లు ఆపేశారు.

- 2015 జులై 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 మధ్య ఏడాది కాలంలో 19 దేశాల్లో 81 సార్లు అంతర్జాల సేవలకు పూర్తి అంతరాయమేర్పడింది. దీనికారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ.16,080 కోట్ల నష్టమేర్పడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/