Begin typing your search above and press return to search.
ఇప్పుడు కానీ కేసీఆర్ దిశ ఇంటికెళితేనా..?
By: Tupaki Desk | 7 Dec 2019 5:16 AM GMTపెను సంచలనంగా మారిన దిశ హత్యాచార ఉదంతం.. ఇది జరిగిన తొమ్మిది రోజులకే దిశ నిందితులు నలుగురు పోలీసుల ఎన్ కౌంటర్ లో హతం కావటం తెలిసిందే. ఈ ఉదంతంపై ప్రజల్లోనూ పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ఈ ఉదంతంపై రెండుగా చీలిపోయారు. ఎన్ కౌంటర్ ను సమర్థించి.. స్వాగతించే వారు ఒక పక్షమైతే..విభేదించి వ్యతిరేకించేవారు మరో వర్గమయ్యారు. కాకుంటే.. మొదటి వర్గం కోట్లాదిగా ఉంటే.. రెండో వర్గం వారు మాత్రం గుప్పెడు మందే కావటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. దిశ హత్యాచార ఉదంతం జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచో పలువురు ప్రముఖులు దిశ తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు రాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పరామర్శ కోసం దిశ ఇంటికి వెళ్లలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన హై ప్రొఫైల్ పెళ్లికి వెళ్లటం.. తర్వాత హైదరాబాద్ లో జరిగిన మరో విందుకు కోసం హాజరుకావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఢిల్లీలోని వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును జాతీయ మీడియా.. సోషల్ మీడియాలలో ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఎప్పటిలానే కామ్ గా.. జరుగుతున్న పరిణామాల్ని చూస్తూ ఉన్నారే తప్పించి స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్ తో ప్రజలు విపరీతమైన ఆనందాన్ని ప్రదర్శించారు. బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచుకొని.. పూలాభిషేకాలు.. పాలాభిషేకాలతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
దిశ హత్యాచార ఉదంతంలో సీఎం కేసీఆర్ పాలనా తీరును పలువురు తప్పుపడితే.. తాజాగా చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. చివరకు మాయావతి లాంటోళ్లు సైతం తెలంగాణలో జరిగింది చూసి నేర్చుకోండంటూ యూపీ పోలీసులకు చురకలు అంటించారు. ఏ ఉదంతంతో తనకు తీరని డ్యామేజీ జరిగిందో.. ఇప్పుడు దానికి మించిన ఇమేజ్ బిల్డింగ్ కు దిశ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేందుకు వెళితే.. ప్రజల్లోరియాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దిశ ఇంటికి కేసీఆర్ కానీ వెళితే.. నా సామి రంగా అన్న రేంజ్లో ఇమేజ్ పెరుగుతుందంటున్నారు. ఈ వాదనల నేపథ్యంలో కేసీఆర్ సన్నిహితులకు పలువురి వద్దా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిశ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేందుకు సీఎం కేసీఆర్ వెళతారా? అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎప్పుడేం చేయాలో బాగా తెలిసిన సీఎంకు.. దిశ తల్లిదండ్రులను పరామర్శించేందుకు గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.