Begin typing your search above and press return to search.

పీరియడ్స్​ టైంలో వ్యాక్సిన్​ తీసుకుంటే ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   15 May 2021 12:30 PM GMT
పీరియడ్స్​ టైంలో వ్యాక్సిన్​ తీసుకుంటే ఏం జరుగుతుంది?
X
నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకోవచ్చా? ఈ ప్రశ్నకు ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సమాధానం చెప్పేసింది. నెలసరి టైంలో ఎవరైనా నిరభ్యంతరంగా వ్యాక్సిన్​ తీసుకోవచ్చని.. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకుంటే జ్వరం, తలనొప్పి, వాపులు వంటి లక్షణాలు కనపించాయని పలువురు మహిళలు సోషల్​ మీడియాలో అంటున్నారు.

అయితే నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకున్నా ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. డాక్టర్లు చెబుతున్నారు. ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దుష్ప్రభావాలు కనిపించాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు అంటున్నారు. నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకున్నప్పుడు రక్తస్రావం ఎక్కువగా అయ్యిందని పలువురు మహిళలు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఇటువంటి సమస్య తలెత్తుంది. మోడెర్నా వ్యాక్సిన్​ తీసుకున్న పలువురు మహిళలు.. ఈ సమస్యను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ సమస్యపై మెడికల్ ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ కేట్ క్లాన్సీ కూడా స్పందించారు.

'కొందరు మహిళలు ఈ విషయాన్ని నా ముందు ప్రస్తావించారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అధ్యయనాలు సాగలేదు. కానీ పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం' అని ఆమె చెప్పారు. నెలసరి టైంలో వ్యాక్సిన్​ తీసుకొంటే ఆరోగ్యసమస్యలు వస్తాయని ఇప్పటివరకు ఎటువంటి పరిశోధనలు తేల్చలేదు. కానీ కొందరు మహిళలు మాత్రం ఈ సమస్యను లేవనెత్తారు .. కాబట్టి ఆ దిశగా పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉంది' అని కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.