Begin typing your search above and press return to search.
కాపురం మొదలైన ఏడాదిలో భార్యకు గర్భం రాకుంటే తేడా ఉన్నట్లేనట
By: Tupaki Desk | 1 Aug 2021 4:18 AM GMTమగాడు.. మగతనం.. అంటూ వినిపించే మాటలు తరచూ వెండితెర మీదా.. బుల్లితెర మీద కనిపిస్తూ.. వినిపిస్తూ ఉంటాయి. మగతనమనే ఈగోకు ఇప్పుడు ముప్పు వచ్చేసింది. సంతాన సామర్థ్యానికి కీలకమైన 'మగతనం'పై ఇప్పుడు విష రసాయనాలు.. ఆధునిక జీవనశైలి ఇప్పుడు షాకులు ఇస్తున్నాయి. వాతావరణ కాలుష్యం పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బ తీయటంతో ఇప్పుడు కొత్త సమస్య తెర మీదకు వచ్చింది. ఇటీవల కాలంలో పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం అంతకంతకూ తగ్గిపోతుందన్న నివేదికలు కొత్త గుబులును పుట్టిస్తున్నాయి.
ఈ తరహా ఇబ్బందిని 30 నుంచి 50 మంది మగాళ్లు ఎదుర్కొంటున్నట్లుగా చెబతున్నారు. నిజానికి వారిలో సమస్య ఏమిటన్నది వైద్యులు సైతం గుర్తించలేకపోతున్నారట. అమెరికాలోని ప్రతి ఎనిమిది జంటల్లో ఒకరు సంతానాన్ని పొందే పరిస్థితి లేదంటున్నారు. సమస్య ఏమిటన్న విషయాన్ని తాము చెప్పలేకపోతున్నట్లుగా.. దీనికి కారణం ఏమిటన్న విషయాన్ని తాము గుర్తించలేకపోతున్నట్లుగా వైద్య ప్రముఖులు సైతం చేతులు ఎత్తేస్తున్న వైనం కొత్త ఆందోళనకు గురి చేస్తోంది.
60 ఏళ్ల క్రితంతో పోలిస్తే పురుషుల్లో వీర్యం కౌంట్ 50 శాతం మేర తగ్గినట్లుగా 1992లో ఒక అధ్యయనం తేలిస్తే.. 1973 నుంచి 2011 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లో వీర్య గాఢత 50-60 శాతం మేర తగ్గినట్లుగా మరో పరిశోధన తేల్చింది. అయితే.. వీర్య కణాల్లో చురుకైన వాటి సంఖ్య కీలకమన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. ఈ ఆరోగ్యకర సంఖ్య ఉన్న పురుషులు గడిచిన పదహారేళ్లలో పది శాతం తగ్గినట్లుగా వెల్లడైంది. ఇందుకు దారి తీస్తున్న పరిస్థితులు ఏమిటన్న దానిపై అధ్యయనం చేస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
పిల్లలు పుట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఏడాదికి కానీ.. దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన ఏడాది కాలంలో భార్య గర్భం దాల్చని వైనాన్ని సంతానలేమిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వేళలో.. ఏడాదిలో గర్భం రాకుంటే ఆ జంట నిపుణుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. పురుషుల విషయంలో సంతాన సాఫల్య సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వీర్యాన్ని విశ్లేషిస్తారు. మిల్లీ లీటరు వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎంతన్నది లెక్క వేస్తారు. అయితే.. సంతాన సాఫల్యతను అంచనా వేయటానికి ఇది సరైన పద్దతి కాదని చెబుతున్నారు. ఏమైనా.. సంతాన లేమికి కారణం ఏమిటన్న విషయాన్ని గుర్తించటం కూడా ఒకింత కష్టంగా మారిందంటున్నారు.
మగాళ్ల సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేయటంతో ప్లాస్టిక్ కీలకమని చెబుతున్నారు. వాటర్ బాటిళ్లు.. ఆహార పదార్థాల్ని నిల్వ చేసే డబ్బాలతో అనేక రకాల ప్లాస్టిక్ లు నిత్యం మన చుట్టూ ఉంటాయి. వాటిల్లోని రసాయనాలు పురుషుల్లోని టెస్టోస్టిరాన్.. వీర్యకణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని గుర్తించారు. దీనికి తోడు మనం తీసుకునే ఫుడ్ లో హెర్బిసైడ్లు.. క్రిమి సంహారక మందులు.. పాస్ఫరస్ తో కూడిన క్రత్రిమ ఆర్గానిక్ పదార్థాలు కూడా సంతానోత్పత్తి స్థాయిని తగ్గిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ల్యాప్ టాప్ లు.. సెల్ ఫోన్లు.. మోడెమ్ లాంటి ఉపకరణాల నుంచి వెలువడే రేడియో థార్మికత కూడా వీర్యం కౌంట్.. కదలికలు.. వాటి రూపాన్ని దెబ్బ తీస్తున్నట్లు చెబుతున్నారు. తినే ఆహారం.. తాగే నీటితో పాటు బ్యూటీ కోసం వాడే క్రీముల్లో ఉండే క్యాడ్మియం.. సీసం.. ఆర్సెనిక్ లాంటివి మగాళ్లలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు చెప్పక తప్పదు. సో.. మగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండండోయ్.