Begin typing your search above and press return to search.
టిక్ టాక్ వీడియో తీస్తుందని భార్యను భర్త ఏంచేసాడంటే ?
By: Tupaki Desk | 28 Nov 2019 9:32 AM GMTప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాక టిక్ టాక్ అంటే తెలియని వారే లేరు. అంతగా అతి తక్కువ రోజుల్లోనే టిక్ టాక్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇటివల టిక్ టాక్ వల్ల చాలా మంది చిక్కుల్లో పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ టిక్ టాక్ ఎన్నో పచ్చని కుటుంబాలలో నిప్పులు పోసింది. తాజాగా అలాంటి ఘటనే మళ్ళీ చోటు చేసుకుంది. టిక్ టాక్ చేస్తున్న భార్యని ఆ వీడియోలు చేయద్దు అని చెప్పినా వినకపోవడంతో .. భార్య పై కోపం పెంచుకున్న భర్త ఆమెని నమ్మించి తన అన్న సహాయంతో హత్య చేసాడు. ఆ తరువాత ఆమె శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.
ఈ దారుణమైన సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని శావల్యాపురం మండలంలో పొట్లూరు జరిగింది. పొట్లూరు గ్రామానికి చెందిన చిన నరసయ్య, సువార్త అనే దంపతులు నివాసం ఉన్నారు. ఇక ఈ మధ్య టిక్ టాక్ ప్రభావం బాగా పెరిగిపోవడంతో ఇటీవలే సువార్త కూడా టిక్ టాక్ కి బాగా అలవాటు పడిపోయింది. దీనితో టిక్ టాక్ చేయడం ఆపేయాలంటూ భర్త పలుసార్లు ఆమెని హెచ్చరించాడు. కానీ , ఆమె మాత్రం టిక్ టాక్ లో వీడియోలు చేస్తూనే ఉన్నది. దీనితో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఆ గొడవలు ఈ మధ్య మరీ ఎక్కువ కావడంతో భర్త తో గొడవ పడి సువార్త ఇంట్లో నుండి వెళ్ళిపోయి సత్తెనపల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో పరిచయమైన వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తనను వదిలేసి హాస్టల్‌లో ఉంటోందని ఆగ్రహానికి గురైన చిన నరసయ్య ఎలాగైనా తన భార్యను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ని మట్టుబెట్టాలని ముందే పథకం వేసిన చిన నరసయ్య ..భార్య దగ్గరికి వెళ్లి ఆమెకి నచ్చజెప్పినట్టు , నమ్మించి మళ్లీ ఇంటికి తీసుకువచ్చాడు. ఆలా ఇంటికి తీసుకోని రాగానే ..తన అన్నతో కలిసి సువార్తను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అన్నదమ్ములు సువార్త మృతదేహాన్ని ఊర్లోని శ్మశానానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. సువార్త వారం రోజులుగా కనిపించకపోవడం.. భర్త ప్రవర్తనపై అనుమానంతో ప్రశ్నించడంతో ఆలస్యంగా ఈ ఘటన బయటకి వచ్చింది.