Begin typing your search above and press return to search.
1.70 లక్షల ఉద్యోగుల్ని అమ్మ తొలగిస్తే ఏమైంది?
By: Tupaki Desk | 7 Oct 2019 7:15 AM GMTఆర్టీసీలో మిగిలింది పన్నెండు వందల మంది ఉద్యోగులే అని తెలంగాణ సీఎం కేసీఆర్ నోటి నుంచి ఆర్టీసీ మీద ఉన్నతాధికారులతో రివ్యూ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన మాటలతో సంస్థలోని 48వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంకేతాలు దాదాపుగా వెలువడ్డాయనే చెప్పాలి. ఇంత భారీగా ఉద్యోగుల్ని నోటి మాటతో తీసేస్తామన్న మాటను గతంలో ఏ ప్రభుత్వం అనే సాహసం చేయలేదు.
అయితే.. కేసీఆర్ మాదిరే మూర్తీభవించిన మొండితనంతో వ్యవహరించే ముఖ్యమంత్రిగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చెబుతారు. 2003లో ఆమె ఇష్టానికి భిన్నంగా సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగుల్ని తీసేసినట్లుగా ఒక్క కలం పోటుతో నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.
ఎస్మా చట్ట ప్రకారం తీసుకున్న అమ్మ ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తూనే.. ఉద్యోగులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పటం గమనార్హం. తాజాగా ఎస్మా చట్టంతో ఆర్టీసీ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా సంకేతాలిచ్చిన కేసీఆర్ మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. ఎంత ప్రభుత్వమైనా.. మరెంత విశేష అధికారాలు ఉన్నప్పటికీ ఏకాకిన.. వేలాదిమంది కార్మికుల్ని నిర్దక్షిణ్యంగా తొలగించటం సాధ్యం కాదనే మాట న్యాయనిపుణులు చెబుతున్నారు.
1.70 లక్షల మంది ఉద్యోగుల్ని నాటి సీఎం జయలలిత తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటే.. సుప్రీంకోర్టు వారికి ఉపశమనం కలిగేలా వారిని తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొంది. అయితే.. వారిని ప్రభుత్వానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. భవిష్యత్తులో సమ్మెలు చేయమని ప్రమాణపత్రం ఇవ్వాలని పేర్కొంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలోనూ ఇదే సూత్రం అమలవుతుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఉద్యోగ సంఘాల వాదన మరోలా ఉంది. తాము చట్టబద్ధంగా సమ్మె నోటీసులు ఇచ్చామని.. మంత్రి ఉన్నా చర్చల్లో పాల్గొనలేదని.. చట్టాలు మూకుమ్మడి తొలగింపుల్ని అనుమతించవంటున్నారు. నాడు అమ్మ చేసిన పనినే నేడు గులాబీ బాస్ చేస్తున్న వేళ.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.