Begin typing your search above and press return to search.

దూసుకొచ్చిన రాయి బాబుకే తగిలి ఉంటే?

By:  Tupaki Desk   |   5 Nov 2022 4:31 AM GMT
దూసుకొచ్చిన రాయి బాబుకే తగిలి ఉంటే?
X
షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షో వేళలో.. ఎత్తైన భనం నుంచి పదునైన రాయి ఒకటి చంద్రబాబు వైసు దూసుకురావటం.. ఆ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు ముఖ్య భద్రతాధికారి రెప్పపాటులో రియాక్టు కావటం.. ఆయనకు అడ్డుగా తగలటంతో గడ్డానికి.. చేతికి దెబ్బ తగిలిన వైనం అందరిని విస్మయానికి గురి చేసింది.

గడ్డం మీద లోతైన గాయమైనట్లుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన రోడ్ షోలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

ఈ దాడి ఉదంతం ఇప్పుడు పెద్ద రాజకీయ రచ్చగా మారింది. ఒకవేళ.. ఈ రాయిని చంద్రబాబు భద్రతను చూసే ముఖ్య అధికారి కానీ అడ్డుకోకుంటే ఏం జరిగేది? అన్నది ప్రశ్నగా మారింది.

దాదాపు డెబ్భై ప్లస్ ఏళ్లు ఉన్న చంద్రబాబుకు వేగంగా వచ్చిన రాయి సూటిగా వచ్చి తగిలితే.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.. ఆయన ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండేదని చెబుతున్నారు.

అయితే.. ఈ రాయిపై అధికార పార్టీకి చెందిన వారి స్పందన వేరుగా ఉంది. సానుభూతి కోసం రాయిని చంద్రబాబు వర్గీయులే ముందస్తు ప్లాన్ వేసుకొని వేయించుకొని ఉంటారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వాదనలో నిజం ఉందా? అన్నది చూస్తే.. ఒకవేళ అలాంటి పనే చేసి ఉంటే..అది చంద్రబాబుకే ప్రమాదకరమని చెబుతున్నారు.

వయసులో పెద్దగా ఉన్నప్పుడు ఇలాంటి పనుల్ని అస్సలు ఒప్పుకోరన్న వ్యాఖ్య వినిపిస్తోంది. ఏమైనా.. ఈ దాడి వ్యవహారం ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.