Begin typing your search above and press return to search.
బైడెన్ దాచిన రహస్య పత్రాల్లో ఏముంది?
By: Tupaki Desk | 11 Jan 2023 1:30 PM GMTఅమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జనవరిలో మార్ ఎ లాగ్ ఎస్టేట్ లో రహస్య పత్రాలు దాచి విమర్శల పాలైన సంగతి తెల్సిందే. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా చెందిన ముఖ్యమైన రహస్య పత్రాలు తరలించారనే అభియోగాలను ఎదుర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్బీఐ పోలీసులకు మార్ ఎ లాగ్ ఎస్టేట్ లోని ఓ గదిలోని పెట్టెలో 67 విశ్వసనీయ.. 92 రహస్య.. 25 అత్యంత రహస్య ప్రతాలు లభించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం అలాంటి ఆరోపణలనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రంప్ మద్దతు దారులు బైడెన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్న సమంలో జో బిడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో నాటి క్లాసిఫైడ్ డాక్యుమెంట్‌లు వాషింగ్టన్ థింక్ ట్యాంక్ వద్ద దొరికాయని వైట్ హౌస్ ఇటీవల వెల్లడించింది. బైడెన్ పాత కార్యాలయంలో ఉక్రెయిన్.. ఇరాన్.. యూకేకు సంబంధించిన సున్నితమైన అంశాలకు చెందిన ఫైల్స్ ఉన్నట్లు మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.
అయితే బైడెన్ తరపు న్యాయవాదులు గత నవంబర్‌లో కార్యాలయ స్థలాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు ఈ పత్రాలను కనుగొన్నారు. ఈ పత్రాలను సమీక్షించడానికి అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ చికాగోలోని యుఎస్ అటార్నీని అప్పగించారు. ఈ అంశంపై ఎఫ్బీఐ సైతం దర్యాప్తు చేస్తోందని సీబీఎస్ న్యూస్ నివేదించింది.
కాగా ఈ రహస్య పత్రాలు నవంబర్లోనే బయట పడినప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు.. డెమోక్రాట్లు మధ్య పోరు హోరాహోరీగా ఫైట్ సాగింది. వీటిలో రిపబ్లికన్లకే స్వల్ప మెజార్టీ దక్కింది.
అయితే జో బైడెన్ మాజీ ప్రైవేట్ కార్యాలయంలోని థింక్ ట్యాంక్‌లో క్లాసిఫైడ్ అని మార్క్ చేసిన ఫైళ్లు ఎలా దొరకాయి అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని కాంగ్రెస్ కమిటీ పేర్కొంది. ఈ సంఘటనపై మెక్సికో సిటీలో ఒక శిఖరాగ్ర సమావేశానికి హాజరైన బిడెన్ తాజాగా స్పందించారు. ఈ విషయం తనను ఆశ్చర్య పరిచిందని మీడియాకు వెల్లడించారు.
తన ప్రైవేట్ కార్యాలయంలో దొరికినట్లు చెబుతున్న రహస్య పత్రాల్లో ఏముందో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. ఈ విషయాల గురించి విచారించ వద్దని తన లాయర్లు తనకు సలహా ఇచ్చారని ఆయన వెల్లడించారు. కాగా దర్యాప్తు సంస్థలకు తమ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. కాగా బైడెన్ వద్ద పది రహస్య పత్రాలు లభ్యం కాగా గతంలో ట్రంప్ వద్ద 325 పత్రాలు దొరికినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.