Begin typing your search above and press return to search.

వైరస్ లు అంటే ఏంటీ? వాటితో ఏం జరుగుతుంది?

By:  Tupaki Desk   |   23 April 2020 7:30 AM GMT
వైరస్ లు అంటే ఏంటీ? వాటితో ఏం జరుగుతుంది?
X
ఏవియన్ - స్పానిష్ - సార్స్ - హైఐవీ - కోవిడ్ 19 (కరోనా) ఇవన్నీ వైరస్ లే.. మానవాళిని కబళించేందుకు పుట్టిన మహమ్మారులే. మనుషుల ప్రాణాలు తీసే ఇవి స్వతంత్రంగా వాటికవే మనల్ని చంపలేవనే విషయం తెలుసా? మన శరీరంలోకి చేరి మన కణాల సహాయంతో పునరుత్పత్తి చేసుకోని కోట్ల వైరస్ లు అయ్యి మనిషిని కబళిస్తాయి. తనకు తానుగా వైరస్ చంపదు. ఇవి పునరుత్పత్తిని సొంతంగా చేసుకోలేవు. అది మన శరీరాన్ని వాహకంగా వాడి కబళిస్తుంది. కోట్లలో పుట్టుకొచ్చి ప్రాణం తీస్తాయి. అసలు వైరస్ అంటే ఏంటి? దాని కథేంటో తెలుసుకుందాం.

*వైరస్ లు అంటే ఏమిటీ

కంటికి కనిపించని అతి సూక్మ కణాలే ‘వైరస్’లు. ఇవి జీవులు కావు. ‘వైరులెంటస్’ అనే లాటిన్ పదం నుంచి దీనికి వైరస్ అనే పేరు వచ్చింది. వైరస్ అంటే విషతుల్యం అని అర్థం. న్యూక్లిక్ ఆమ్లాలు - ప్రొటీన్లు - లిపిడ్లు - నీటితో తయారవుతాయి. బ్యాక్టీరియాతో పోలిస్తే 100 నుంచి 1000 రెట్లు చిన్నవి. సగటున వీటి వెడల్పు 20-400 నానో మీటర్లు ఉంటాయి ఇవి సొంతంగా మనుగడ సాగించలేవు. మొక్కలు - జంతువులు - సూక్ష్మ జీవులు - మనుషులపై ఆధారపడుతాయి. శరీరం వెలుపల క్రియాశీలంగా ఉండవు. ఆహారాన్ని శక్తిగా మార్చుకునే శక్తి వీటికి ఉండదు. కానీ శరీరంలోకి చేరాక కణాలను పట్టి కోట్ల పునురుత్పత్తి చేస్తాయి. అయితే వీటికి డీఎన్ ఏ - ఆర్ ఎన్ ఏ ఉండడంతో వీటిని జీవులు అనకుండా.. రసాయనాలు అనకుండా ప్రత్యేక తరగతిగా పరిగణిస్తారు.

*వైరస్ లు మనిషికి ఎలా సంక్రమించాయి?

మానవాళికి వైరస్ లు వేలాది సంవత్సరాలుగా జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయి. వ్యవసాయం కోసం జంతువులు ఆవు - బర్రె - కుక్క సహా మచ్చిక చేసుకునే క్రమంలో వైరస్ లు మానవుడికి సోకాయి.తాజాగా చైనాలో గబ్బిలం తినడం వల్ల కరోనా వైరస్ మనిషికి సోకి అది అందరి ప్రాణాలు తీస్తున్నాయి.

*ఎవరు వైరస్ లను కనుగొన్నారు.

1892లో రష్యాన్ బ్యాక్టీరియాలజిస్టు దిమిత్రి ఇవానోవ్ స్కీ తొలిసారిగా వైరస్ ఆచూకీని కనుగొన్నారు. 1935లో వెండెల్ ఎం స్టాన్లీ వైరస్ సమూహాన్ని విశ్లేషించారు. తొలుత బ్యాక్టీరియాను గుర్తించి దానికంటే చాలా చిన్నదైన వైరస్ ను కనుగొన్నారు.

*వైరస్ లు ఎక్కడివి?

ఉత్పత్తి కోల్పోయిన కణాల శకలాలే వైరస్ లుగా మారాయి. భూమ్మీద మనుషుల కంటే పూర్వమే అతిపురాతన జీవం ఉన్న కణాలు ఈ వైరస్ లు. మానవ డీఎన్ ఏలో దాదాపు సగ భాగం వైరస్ ల నుంచే వచ్చాయి. కానీ తరువాత అంతరించిపోయాయి.

*ఎలా వైరస్ లు జబ్బులను కలుగుజేస్తాయి?

వైరస్ లు స్వతహాగా అభివృద్ధి చెందలేవు. ఇవి పునరుత్పత్తి కోసం మనుషులు - జంతువులు - మొక్కలు - సూక్ష్మ జీవులు - శిలింద్రాల శరీరంలో చేరుతాయి. మన కణాల్లోకి ఈ వైరస్ తన జన్యు పదార్థాన్ని ప్రవేశపెడుతాయి. కణాన్ని హైజాక్ చేసి వేలు - లక్షలు - కోట్లలో కొత్త వైరస్ లను పుట్టిస్తాయి. ఇతర కణాలను ఆక్రమిస్తాయి. ఫలితంగా మనకు జబ్బు చేస్తుంది.

*వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

వైరస్ లు ఒక చోటు నుంచి మరోచోటకి స్వతహాగా ప్రయాణించలేవు. కంటికి కనిపించని బరువుగా లేని ఇవి రోగి శరీరం నుంచి బయటక వచ్చాక గాలిలో ఎగరగలవు. నీటిలోనూ మనుగడ సాగిస్తాయి. కరచాలనం - దగ్గు - తుమ్ముల ద్వారా మరొకరికి సోకుతాయి. చల్లటి - పొడి వాతావరణంలో ఎక్కువ కాలం జీవిస్తాయి. చలికాలంలో అయితే కరోనాతో ఇంకా వేలమంది చనిపోయేవారు. ఎండకాలం కావడంతో కాస్త తగ్గుతోంది. వ్యక్తి రక్తం - మలం - వాంతుల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. ఇక డెంగి - గన్యా - జికా వంటి వైరస్ లు దోమల ద్వారా మనుషులకు సంక్రమిస్తాయి.

*వైరస్ లకు మందులు కనిపెట్టడం కష్టం

వైరస్ లు వేగంగా పరిణామం చెందుతాయి. కణాలను నాశనం చేస్తాయి. ఉత్పరివర్తనాల ద్వారా వివిధ రూపాల్లోకి మారుతాయి. రోగ నిరోధక వ్యవస్థను బోల్తా కొట్టిస్తాయి..అందుకే టీకాలు - మందులు - కనిపెట్టడం కష్టం.

*టీకాలు సులువే.

ఇప్పటికే మానవాళి పోలియో - మీజిల్స్ - రుబెల్లా వైరస్ లకు టీకాలు కనిపెట్టింది. ఇప్పుడు కరోనా - ఎబోలా - జికా - హెచ్ ఐవీలపై పరిశోధనలు సాగుతున్నాయి. వైరాలజిస్టులు వీటిపై పైచేయి సాధిస్తున్నారు. కానీ టైం పట్టే అవకాశాలున్నాయి.