Begin typing your search above and press return to search.
బ్లూ ఆధార్ కార్డు అంటే ఏంటి.. ఎవరికి ఇస్తారు , ఎందుకు ఇస్తారు
By: Tupaki Desk | 13 Oct 2021 12:04 PM GMTఆధార్ కార్డు గురించి వింటూనే ఉన్నాం. కానీ, అయితే ఇటీవల బ్లూ ఆధార్ కార్డు తరుచూ వినిపిస్తోంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అయిదేళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారి కోసం బాల ఆధార్ కార్డును తీసుకు వచ్చారు. ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది. దీనినే బాల్ ఆధార్ కార్డు లేదా బ్లూ ఆధార్ కార్డు అంటారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018లో దీనిని ప్రవేశపెట్టింది. ఈ కార్డును అయిదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఇస్తారు. ఈ కార్డులో కూడా 12 అంకెలు ఉంటాయి. కార్డుదారుకు 5 సంవత్సరాలు దాటితే ఈ కార్డు ఇన్-వ్యాలిడ్ అవుతుంది.
సాధారణ ఆధార్ కార్డు వలె పేరెంట్ రిజిస్ట్రేషన్ కోసం తమ బిడ్డ కోసం ఫామ్‌ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత చిన్నారి ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రిలేషన్‌షిప్ ప్రూఫ్, పుట్టిన తేదీ వంటి పత్రాలు జమ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ ఆధార్ కార్డుతో పోలిస్తే బ్లూ ఆధార్ కార్డు కాస్త భిన్నంగా ఉంంటుంది. వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది బాల్ ఆధార్ కార్డు అంటే అయిదేళ్ల లోపు చిన్నారుల కార్డు కాబట్టి పిల్లల బయోమెట్రిక్ సమాచారం ఉండదు. అయితే చిన్నారి అయిదేళ్లు దాటితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తప్పనిసరిగా బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయాలి. ఆ తర్వాత పదిహేను సంవత్సరాల వయస్సులో మరొకటి అవసరం. టీనేజ్ ఆధార్ కార్డుదారులకు బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితం.
UIDAI ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల స్కూల్ ఐడీని ఉపయోగించి బ్లూ ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ చిన్నారిని నమోదు చేస్తే, వారు జనన ధృవీకరణ పత్రాన్ని లేదా వ్యాలీడ్ అయ్యే ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు బాల్ ఆధార్ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి మీ చిన్నారిని తీసుకు వెళ్లాలి. అయితే అక్కడకు వెళ్లే సమయంలో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకు పోవడం మరిచిపోవద్దు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లిన తర్వాత మీరు అక్కడ ఫామ్‌ను నింపాలి. ఆ తర్వాత పేరెంట్ ఆధార్ కార్డును ఇవ్వమని అడుగుతారు. ఫోన్ నెంబర్ కూడా అడుగుతారు. దాని కింద బ్లూ ఆధార్ కార్డు జారీ చేస్తారు. బ్లూ ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ సమాచారం అవసరం లేదు. కాబట్టి ఫోటోగ్రాఫ్ మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నిర్ధారణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలన అనంతరం మీకు వెరిఫికేషన్ పూర్తి అయినట్లుగా సందేశం వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న 60 రోజుల్లో బ్లూ ఆధార్ కార్డును సంబంధిత చిరునామాకు పంపిస్తారు. లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తీసుకోవచ్చు.