Begin typing your search above and press return to search.
కరోనా మహమ్మారి ఎలా మోసం చేస్తుందంటే ..?
By: Tupaki Desk | 24 April 2020 1:30 AM GMTకరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. ఈ కరోనాతో ప్రపంచంలోని ప్రతి దేశం అల్లకల్లోలంగా మారింది. కాగా, ఈ కరోనా మహమ్మారి బయటపడి ఇప్పటికే నాలుగు నెలలు దాటిపోవడంతో .. దాని లక్షణాలూ - నివారణ చర్యల గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కానీ ఆ వైరస్ కు మరికొన్ని చిత్ర విచిత్ర గుణాలున్నాయి. మన కణంతో వ్యవహరించే సమయంలో అది చేసే మోసాలున్నాయి. ఈ మహమ్మారి గురించి నిపుణులకూ - డాక్టర్లకూ తెలిసినా... చాలామందికి పెద్దగా తెలియని ఆ వైరస్ గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి.
‘కరోనా’ అనేది వైరస్ తాలూకు కుటుంబానికి ఉన్న పేరు. ఇన్ ఫ్లుయెంజా - సార్స్ - మెర్స్ లాంటి ఏడు ప్రధానమైనవి దాదాపుగా మనలో చాలామందికి తెలుసు. కానీ ఆ కుటుంబంలో దాదాపు 40 వరకు వైరస్ లు ఉన్నాయి. అవన్నీ గ్రహణం పట్టినప్పుడు సూర్యుడి చుట్టూ వచ్చే అగ్నికీలల్లా కనిపిస్తుంటాయి. ఆ కీలలు కిరీటంలోని పైకి పొడుచుకొచ్చేలాంటి నిర్మాణాన్ని పోలి ఉంటాయి కాబట్టీ... ఇంగ్లిష్ లో కిరీటాన్ని కరోనా అంటారు కాబట్టీ... ఆ కుటుంబానికి ఆ పేరు వచ్చింది. ఇంగ్లిష్‌లో పైకి పొడుచుకొచ్చిన ఆ నిర్మాణాలను స్పైక్స్ అనీ అంటారు.
కాగా , ఇప్పుడు మనం కొమ్ముల్లాంటి స్పైక్స్ చేసే మాయను తెలుసుకుందాం. నిజానికి కరోనా వైరస్ చాలా మోసకారి. మనలోని చాలామంది ఇప్పటికే వైరస్ ఆకృతిని చూసి ఉన్నాం కదా. గుండ్రని వైరస్ మీద కొమ్ముల్లా పొడుచుకొచ్చిన ఆ స్పైక్స్ చివర్లో లవ్ గుర్తు లాంటి చివరిభాగాన్నీ చూస్తున్నాం. లవ్ గుర్తు లాంటి ఆ చివరి భాగం మన కణానికి ఉపయోగపడే ఓ పదార్థంలాగా మన జీవకణాన్ని నమ్మిస్తుంది. దాంతో మన జీవకణంలోని రిసెప్టార్ అనే భాగాలు... దాని మోసాన్ని గ్రహించలేక ఆ దాన్ని తమ దగ్గరకు ఆహ్వానిస్తాయి. అంతే... తొలుత ఆ లవ్ మార్కులా ఉన్న భాగాన్ని ఆశచూపి... వెంటనే కొమ్ములాంటి పైప్ సహాయంతో వైరస్ లోపల ఉన్న ‘ఆర్ ఎన్ ఏ’ అనేది లోపలికి ప్రవేశించి - మన కణాన్ని హైజాక్ చేసి - దాన్ని తన అదుపులోకి తీసుకుని, తన తాలూకు జీవక్రియలను నెరిపి తనలాంటి అనేక కాపీలను పుట్టించమంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది.. తాను ఆ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో తనకు అవసరమైన జీవక్రియలను నిర్వహించుకోలేక మన జీవకణం మరణిస్తుంది. ఇలా మన జీవకణాల్లోని చాలా కణాలను నాశనం చేయడం వల్ల మనకు మెల్లి మెల్లిగా ప్రమాదం ఏర్పడుతుంది.
ఇక్కడే కరోనా మరో మోసం చేస్తుంది. మానవ పరిణామక్రమంలో మన వ్యాధి నిరోధకశక్తికి దోహదపడే మన కణాలు ఎన్నెన్నో వైరస్ లను గుర్తు పెట్టుకున్నాయి. అయితే మనలోకి చేరిన కరోనా అనే శత్రుకణంలోని కొన్ని ప్రోటీన్ లు... మన కణాల్లో ఉండే ప్రోటీన్లతో పోలి ఉండటం వల్ల మన వ్యాధి నిరోధక కణాలు - ఏది శత్రుకణమో ఏది మిత్రకణమో తెలియని అయోమయంలో పడి మోసపోతాయి. ఈ గందరగోళంలో మన వ్యాధినిరోధక శక్తి ఎవరిపై దాడి చేయాలో తెలియక ఒక్కోసారి మన కణాలనూ దెబ్బతీసే ప్రమాదానికి ఒడిగడతాయి. మన కణాలేవో తెలుసుకునే సమయానికే జరగాల్సింది జరిగిపోతుంటుంది.
ఇలా చాలా వేగంతో చాలా త్వరితంగానూ - చాలామందికి సోకే వైరస్ ల విషయంలో ఒక మంచి కూడా ఉంది. అది చాలామందికి సోకే ప్రమాదం ఉన్నందున త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే, సమాజంలోని చాలామందికి దానినుంచి వ్యాధినిరోధకత వృద్ధి చెందడం జరుగుతుందన్నమాట. ఇది ఒక మంచి పరిణామం అనుకున్నా ఇక్కడ మరో ప్రమాదం ఉంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 14 రోజులుగా ఉన్నందున - చాలామందిలో వాళ్లకు తెలియకుండానే దాగుండి - చాలామందిని రోగగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఇది చెడు పరిణామం. ఇలా కరోనాలో మంచీ - చెడూ రెండూ ఉన్నాయి. కానీ చెడు చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అందుకే లాక్ డౌన్ పాటించాల్సిన అవసరం, జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువ.
ప్రపంచంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 1,00,000 చేరడానికి మొదటగా 67 రోజుల పట్టింది. ఆ తర్వాత కేవలం 11 రోజుల్లోనే మరో లక్షమంది రోగులు ఆ జాబితాకు చేరారు. ఇక ఆ తర్వాత కేవలం నాలుగు రోజులకే మరో లక్షమంది రోగులు కరోనా దాని బారిన పడ్డారు. ఇలా రోజురోజుకి తమ వ్యాప్తిని విస్తరించుకుంటూ పోతుంది. ఈ కొత్త కరోనా వైరస్ అన్నది మొదట గబ్బిలాల నుంచి ప్రారంభమై... ఆ తర్వాత ‘సివెట్ క్యాట్స్’ అనే రకం జంతువుల నుంచి అని కొందరు - ప్యాంగోలిన్ అనే చీమలు తినే జీవి నుంచి అని ఇంకొందరు వాదిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి.
కరోనా వైరస్ మనిషికి ప్రమాదకరమైనదని గుర్తించిన కొన్నాళ్ల తర్వాత... దీన్ని ఓ పులిలోనూ - పిల్లిలోనూ కనుగొన్నారనే వార్తలు వచ్చాయి. జంతువుల నుంచి ఇది సోకిందన్న వార్తలు రాగానే కుక్కలూ - పిల్లుల్లాంటి తమ పెంపుడు జంతువులను కొందరు రోడ్లపై విడిచిపెట్టి వెళ్లారు. కానీ, ఇది మనుషుల నుంచి పులికీ - పిల్లికీ పాకిన దాఖలాలున్నా - కుక్కలూ - పిల్లుల వంటి మన పెంపుడు జంతువుల నుంచి మనకు వచ్చిన దాఖాలాలైతే లేవు . కాబట్టి పెంపుడు జంతువులని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వైరస్ నివారణకు సబ్బు - శానిటైజర్ తో చేతులను శుభ్ర పరచకోవడం ఓ మంచి మార్గం. అయితే సబ్బు, శానిటైజర్ లభించని పక్షంలో వైద్యవర్గాలకు అందుబాటులో ఉండే ‘హ్యాండ్ జెల్ యాంటీసెప్టిక్’ను కూడా వాడవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
యాంటీబయాటిక్స్ వైరస్ ను చంపేయలేవు. అందుకే హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్ వాడి - దాని నుంచి రక్షణ పొందవచ్చనే వార్తలు విని విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం మంచిది కానే కాదు. ఆ మాత్రలు కేవలం ఫస్ట్ లైన్ సోల్జర్స్ గా... నిత్యం రోగులతో ఉండే వారికి ప్రొఫిలాక్సిస్ గా మాత్రమే వాడాలి. మిగతావారికి అవి ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు. ఈ కరోనా వైరస్ తో వచ్చే కరోనా వ్యాధికి వైద్యం చేసేందుకు మలేరియా మందు అయిన ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’, హెచ్ ఐవీ రోగులకు వాడే ‘లోపినవిర్’, ఎబోలా వైరస్ వ్యాధికి వాడే ‘రెమ్ డెసివిర్’ మందులతో పాటు జపాన్ వంటి దేశాల్లో యాంటీ–ఫ్లూ మందుగా వాడే అవిగాన్ వంటి రకరకాల మందులు వాడుతున్నారు. ఇక వ్యాధి బాగా ముదిరి... ఏమాత్రం వెనక్కిరారనుకునే రోగులకు మాత్రం కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మాలోని యాంటీబాడీస్ తో చేసే ‘ప్లాస్మాథెరపీ’ ప్రక్రియనూ అవలంబిస్తున్న విషయం తెలిసిందే.