Begin typing your search above and press return to search.
బాబూ... ఇది ఏమి ప్రజాస్వామ్యం !
By: Tupaki Desk | 17 Dec 2018 6:25 AM GMT"ఇదీ ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా, ఎక్కడనుంచైనా పోటీ చేయవచ్చు. ఎవరైనా, ఎక్కడికైనా రావచ్చు... పోవచ్చు" ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తామూ తలదూరుస్తామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు పై విధంగా స్పందించారు. ఈ స్పందనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. నిజమే కదా దేశంలో ఎవరైనా ఎక్కడికైన వెళ్లవచ్చు కదా... ప్రచారం చేసుకోవచ్చు కదా... పోటీ చేయవచ్చు కదా.. అని రాజకీయ పార్టీలే కాదు ప్రజలు అనుకున్నారు. చంద్రబాబు నాయుడి ప్రకటన పై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, ఆ తర్వతే అసలు సినిమా ప్రారంభమయ్యింది.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రకటన కు పూర్తి విరుద్దంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళావెంకట్రావు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైన ఎక్కడికైనా వెళ్లచ్చు... ఎమైన చేయవచ్చు అన్న తమ అధ్యక్షుడి అభిప్రాయాలను ఖండించే విధంగా కళా వెంకట్రావు స్పందించారు. తెలంగాణ మందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం ఏంటని కళా వెంకట్రావు ప్రశ్నించారు. నిజానికి వైసీపీ ఎక్కడా పార్టీ తరఫన సంబరాలు చేయలేదు. ఎవరో కొందరు యువకులు అత్యుత్సాహం తో బాబు ను ఇరిటేట్ చేయడానికి ఆయన ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ దీనిని వైసీపీ చేసినట్టు ఇలా చేయడం తప్పు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగ అబద్ధపు లేఖ రాసారు కళా వెంకట్రావు. బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు ఇదేం విచిత్రమైన సైకోతనమో ఆయనకే తెలియాలి.
జగన్ తెరాస కు అనుకూలంగా ఏ ప్రకటనా చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ గతంలో తీవ్రంగా విబేధించిన భారతీయ జనతా పార్టీ తో కలసి 2014 సంవత్సరంలో పోటీ చేసింది. మరి విభజనలో బీజేపీ పాత్ర లేదా? అలాగే రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో కలసి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయలేదా.. అని నిప్పులు చెరుగుతున్నారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పరిణితి చెందిన రాజకీయ పార్టీగా వ్యవహరించింది. బాబు ఓవర్ యాక్షన్ చేయబోయి ఎలా బొక్కబోర్లా పడ్డారు అని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారంతే. తప్పు బాబు వద్ద పెట్టుకుని ఇతరులను అనడం ఎందుకు?