Begin typing your search above and press return to search.
ఏమిటి ఎక్మో చికిత్స? కరోనా రోగి ఎలా బతికాడు?
By: Tupaki Desk | 21 Aug 2020 9:10 AM GMTదేశంలో మరెక్కడా లేని రీతిలో తొలిసారి ఒక యువ వైద్యుడ్ని బతికించేందుకు హైదరాబాద్ వైద్యులు వినూత్న వైద్య విధానాన్ని అమలు చేసి.. విజయం సాధించారు. కోవిడ్ బారిన పడిన అతడ్ని.. ఎంతగా ప్రయత్నించినా అతడి ఆరోగ్యాన్ని మెరుగుపర్చలేకపోయారు. ఇలాంటివేళలో.. కష్టతరమైన చికిత్సా విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యారు. దాదాపు నలభై రోజుల పాటు కరోనాతో పోరాడిన ఆ యువ వైద్యుడు ఎట్టకేలకు విజయం సాధించాడు. ఇంతకీ ఎక్మా ట్రీట్ మెంట్ అంటే ఏమిటి? ఆ యువ వైద్యుడికి ఎందుకు చేశారు? అతని సక్సెస్ స్టోరీలోకి వెళితే..
వరంగల్ జిల్లాకు చెందిన పిల్లల వైద్యుడు దయానంద సాగర్. శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఆయన పరీక్ష చేసుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ లో జులై మొదటి వారంలో చేరారు. ఎన్ని రకాలుగా చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కరోనా గండం నుంచి గట్టెక్కలేని పరిస్థితి. రోజులు గడుస్తున్నకొద్దీ.. పరిస్థితి మరింత దిగజారటమే కాదు.. గుండె.. ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లటం మొదలైంది.
ఈ నేపథ్యంలో యువ వైద్యుడ్ని కాపాడేందుకు కేర్ వైద్యులు ఎక్మో ట్రీట్ మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ ట్రీట్ మెంట్ ఎలా సాగుతుంటుందన్నది చూస్తే.. రోగి తొడలోని రక్తనాళానికి ఒక పైపు లాంటిది అమరుస్తారు. దానికి ఊపిరితిత్తి.. గుండె లాంటి అర్టిఫిషియల్ పరికరాన్ని అమరుస్తారు. ఆ పరికరం ద్వారా మరో పైపును మెడ ద్వారా గుండె రక్తనాళానికి అనుసంధానిస్తారు.
ఈ పరికరం పని చేయటం షురు కాగానే తొడ దగ్గర ఏర్పాటు చేసిన పైపు ద్వారా రక్తాన్ని బయటకు తీస్తారు. ఈ విధానంలో రక్తంలోకి ఆక్సిజన్ నేరుగా కలుస్తుంది. శరీరం నుంచి రక్తాన్ని ప్రత్యేక బైపాస్ సర్క్యూట్ సాయంతో బయటకు తీసిన వెంటనే ఆక్సిజన్ కలిపి మరో పైపు ద్వారా గుండెకు ఈసీఎంవో సప్లై చేస్తుంది. దీంతో ఆక్సిజన్ తో కూడిన రక్తం గుండె నాళానికి.. ఇతర అవయువాలకు సరఫరా అవుతుంది. దీంతో.. అతడి ఆవయువాలు మరింత మెరుగ్గా పని చేస్తాయి. ఈ క్రిటికల్ ప్రొసీజర్ ను ఫాలో అయిన అధికారులు ఆ యువ వైద్యుడ్ని కాపాడటమే కాదు.. ప్రస్తుతం కోలుకొని డిశ్చార్జి కావటానికి సిద్ధమవుతున్నాడు. ఒక విధంగా ఇలాంటి ప్రయోగాలు చేయటం ద్వారా.. దేశంలోని వైద్యుల్లో హైదరాబాద్ వైద్యుల పని తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.